టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ భాషా రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ భాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకొచ్చింది. పింఛన్లు, ఇంటిస్థలాలు ఇప్పిస్తానని లైంగికదాడి చేశాడంటూ ఓ మహిళ బహిర్గతం చేసింది.
ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలపై లైంగిక దాడులు చేస్తూ పెట్రేగిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో అసభ్యంగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ హైకమాండ్ ఆయన్ను సస్పెండ్ చేసింది.
ఇది మరువక ముందే మరో టీడీపీ నేత రాసలీలలు బహిర్గతమయ్యాయి. సదరు టీడీపీ నేత ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియో సంచలనం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన TDP రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ భాషా రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. ఓ యువతితో ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
రాత్రికి వస్తే పింఛన్లు, ఇంటి స్థలాలు ఇప్పిస్తా.
రాష్ట్రంలో పేద మహిళలే టార్గెట్ గా ఖాదర్ భాషా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పేద మహిళలే టార్గెట్ గా చేసుకుంటూ.. వారిపై లైంగిక వేధింపులు చేస్తున్నట్లు సమాచారం. పింఛన్లు, ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ ఖాదర్ భాషా లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ బహిర్గతం చేసింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది.
కాగా ఖాదర్ బాషా రాయలసీమకు చెందిన ఓ మంత్రికి ప్రధాన అనుచరుడని తెలుస్తోంది. అతడు గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ అబ్జర్వర్‌గా సమర్ధవంతంగా పనిచేశారు. అయితే ఇప్పుడు అతడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఓ మంత్రి తరపున అన్న పనులు తానే చూసుకుంటానని చెప్పి ఇలా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఖాదర్ బాషా స్పందిస్తారా? లేదా? అనేది చూడాలి.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025