చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అనంతరం తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు.
కుప్పంపట్టణం : చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత వీరంగం సృష్టించారు. అనంతరం తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని మునిస్వామిపురం కాలనీలో కుప్పం మున్సిపల్ తెదేపా అధ్యక్షుడు రాజ్కుమార్ సోదరుడు వినయ్ పై వైకాపాకు చెందిన ఓ నాయకుడి ఇద్దరు కుమారులు తమ అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వినయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 12న గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా వెలుగు చూసింది. వినయ్ తోపాటు తెదేపా కార్యకర్తలు, మరో వ్యక్తిపై నలుగురు యువకులు దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మద్యం మత్తులో నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చి వారిపై దాడికి పాల్పడిన దృశ్యాలు నమోదైన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యా ప్రయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన యువకులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!