SGSTV NEWS
CrimeTelangana

Hyderabad Murder News: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. తల్లీ, కొడుకుపై కత్తులతో దాడి!



హైదరాబాద్‌లో పట్టపగలే ఘోరం జరిగింది. మెట్టుగూడలో బైక్‌పై వెళ్తున్న తల్లీ కొడుకు రేణుక, యశ్వంత్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు


Hyderabad Murder News: హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే దారుణం జరిగింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కొంతమంది దుండగులు తల్లీ, కొడుకుపై దారుణానికి పాల్పడ్డారు. పాత పగల నేపథ్యంలో కత్తులతో వెంటపడి పరిగెత్తించి దాడిచేశారు. ఈ ఘటన మెట్టుగూడలో చోటుచేసుకోగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. అక్కడున్నవారంతా పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ముసుగు ధరించి అటాక్..
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మెట్టుగూడలో బైకుపై వెళ్తున్న తల్లీ రేణుక, కొడుకు యశ్వంత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అయితే దాడి చేసే సమయంలో దుండగులు ముసుగు ధరించి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కత్తి గాయాలైన ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా యశ్వంత్, రేణుక పిరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యశ్వంత్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది

Also read

Related posts

Share this