విజయవాడ నగరంలో మహిళ మృతి ఘటన తీవ్ర కలకలం రేపింది. కృష్ణలంకలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో మహిళ మృతదేహం బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. మృతురాలిని పైడిశెట్టి ఎర్రమ్మగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఎర్రమ్మ రెండు రోజులుగా కనిపించకపోవడంతో ఆమె భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య ఆచూకీ తెలియడం లేదని పోలీసులకు వివరించారు. ఈ క్రమంలోనే కృష్ణలంక బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో ఆమె మృతదేహం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఎర్రమ్మఓ యువకుడితో కలిసి లాడ్జికి వచ్చినట్లు గుర్తించారు. అయితే, ఆమెను ఆ యువకుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం గది తలుపులకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే లాడ్జికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ ఎర్రమ్మతో వచ్చిన యువకుడి వివరాలు, ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు ఎర్రమ్మను హత్య చేయడానికి గల కారణాలేమిటి? ఆమెతో లాడ్జికి వచ్చిన యువకుడు ఎవరు? ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
Also read
- డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. నారాయణపేట జిల్లాలో విషాదం
- లాడ్జిలో మహిళ అనుమానాస్పద మృతి.. హత్య చేసి తాళం వేసి వెళ్లిపోయిన యువకుడు
- మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం
- కార్తీక స్నానం ఎలా చేయాలి? వేడి నీటితో స్నానం చేయవచ్చా?
- Labh Panchami: లాభ పంచమి ఎప్పుడు? ఈ రోజున ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలే లాభాలట!





