December 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి అనుమానాస్పద మృతి

విజయవాడ: విజయవాడలోని గురునానక్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబం ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు.

మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. శ్రీనివాస్ కుంటుంబం మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ రామకృష్ణ.. అక్కడ పరిశీలించారు. మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)గా పోలీసులు గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా శ్రీనివాస్.. కుటుంబ సభ్యులను హత్యచేసి.. ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు మాట్లాడారు. ‘శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు. తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం’ అని తెలిపారు.

Also read

Related posts

Share via