పెనమలూరు: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పని చేస్తూ ఇటీవల సస్పెన్షన్ కు గురైన వీరవల్లి గోపి వెంకటదుర్గాప్రసాద్ (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…దుర్గాప్రసాద్ (58) పటమట లంకలో భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు స్టేషన్లలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఏఎస్ఐగా పటమట పోలీస్ స్టేషన్లో క్రైం విభాగంలో పని చేస్తున్న సమయంలో ఆయనపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన బుధవారం పెదపులిపాక చిన్నకట్ట రోడ్డులో ఓ గేదెల షెడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసు వర్గాల్లో కలకలం
విధుల నుంచి సస్పెన్షన్ కు గురైన దుర్గాప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మరణించడం పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ఏఎస్ఐపై ఒత్తిడి పెరగడంతోనే మృతి చెందాడని చర్చించుకుంటున్నారు. ఇటీవల పటమట పంట కాలువ రోడ్డులో అర్ధరాత్రి ఓ షాపు తెరిచి ఉండగా నైట్ రౌండ్స్‌లో ఉన్న ఏఎస్ఐ షాపు యజమానిని మందలించిన ఘటనపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు.
కాగా విజయవాడ పటమట లంకలో ఉంటున్న ఏఎస్ఐ పెదపులిపాక కట్ట సమీపంలోని గేదెల షెడ్డు వద్దకు ఎందుకు వచ్చాడన్నది మిస్టరీగా ఉంది. మరోవైపు తన తండ్రి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని మృతుని కుమారుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్‌ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి
- సంగారెడ్డిలో కిడ్నాప్ గ్యాంగ్ హల్చల్.. ఐదుగురు పిల్లలను..
- బాలికతో అసభ్య ప్రవర్తన కేసు.. హెడ్ కానిస్టేబుల్ కు పదేళ్ల జైలుశిక్ష





