బెంగళూరు: తిరుపతికి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులో మంగళవారం జరిగింది. నెలమంగల పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీ(25) అనే మహిళ తిరుపతి నుంచి బెంగళూరులోని ఓళపేటెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది.
మంగళవారం ఉదయం స్నానాల గదిలోకి వెళ్లింది. 25 నిమిషాలైనప్పటికీ బయటికి రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించగా స్పృహకోల్పోయిన స్థితిలో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ముఖంపై గీతలు కనిపించినట్లు భర్త చెబుతున్నాడు.
గ్యాస్ గీసర్ తో విషపూరితమైన కార్బన్ మెనాక్సైడ్ గ్యాస్ తో ఊపిరాడకపోవడంతో మృతి చెందే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా గీసర్ ఆపివేసి ఉందని భర్త తెలిపారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి