ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా నాలుగు దశాబ్ధాలకు పైగా అజ్ఞాతంలో గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు పోతుల కల్పన, అలియాస్ పద్మావతి అలియాస్ సుజాత అలియాస్ మైనక్క ఈ రోజు తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.
Maoist Party :  ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా నాలుగు దశాబ్ధాలకు పైగా అజ్ఞాతంలో గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు పోతుల కల్పన, అలియాస్ పద్మావతి అలియాస్ సుజాత అలియాస్ మైనక్క ఈ రోజు తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 19 ఏళ్ల వయసులో అడవిబాట పట్టిన సుజాతక్క తన 62వ ఏటా తిరిగి జనవాసంలోకి అడుగుపెట్టారు. కాగా సుజాత స్వస్థలం నాటి పాలమూరు (మహబూబ్‌నగర్) జిల్లా. నేటి గద్వాల జిల్లా గట్టు మండలంలోని పెంచికల్పాడు గ్రామం ఆమె సొంతూరు. 
సుజాత సుమారు 43 సంవత్సరాల పాటు  సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ  సెక్రటేరియట్ సభ్యురాలిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ  పరిధిలోని దక్షిణ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా, జనతన్ సర్కార్ (రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ బాధ్యురాలిగా అనేక హోదాల్లో పని చేశారు. ఒకవైపు పార్టీ బాధ్యతలతో పాటుగా కోయ భాషలో వచ్చే ‘పేతురి’ అనే పత్రికకు ఆమె ఎడిటర్‌గా కూడా పని చేశారు.ఈ పత్రిక ఏడాదికి మూడు సార్లు దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ప్రాంతంలో ప్రచురిస్తారు.
సుజాతకు వయసు మీద పడటం, ఆరోగ్యం సహకరించకపోవడంతో అజ్ఞాతం వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని 2025 మే నెలలో సీపీఐ (మావోయిస్టు) పార్టీని విడిచిపెట్టాలనే తన నిర్ణయాన్ని పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, CCM ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయంతో జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానికి కూడా తెలియజేశారు. ఈ క్రమంలోనే నాలుగు దశాబ్ధాల అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పారు. అరోగ్యం క్షీణించడంతో  పాటు పార్టీకి సేవ చేయడానికి ఆమె శరీరం సహకరించకపోవడం కూడ  ఆమె ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణమని తెలుస్తోంది. సుజాత ఇక మీదట సాధారణ జీవితాన్ని గడపాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలను సద్వినియోగించుకుని తన ఆరోగ్యాన్ని చూసుకుంటూ, కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
కాగా, పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క జనజీవన స్రవంతిలో కలిచిన నేపథ్యంలో ఆమెపై ఉన్న రూ.25 లక్షల నగదు బహుమతిని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఆమెకే అందజేస్తారని తెలుస్తోంది. అదనంగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకానికి అనుగుణంగా, లొంగిపోయిన మావోయిస్టులకు లభించే అన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఆమెకు వర్తిస్తాయి. 43 ఏళ్ల పాటు పాటు అజ్ఞాత జీవితంలో ఉన్న సీనియర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు (CCM)అయిన పొతుల పద్మావతి జనజీవన స్రవంతిలోకి రావడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించడమే కాకుండా  ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస కార్యక్రమాలకు ప్రాధాన్యత లభించినట్లయింది.
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 - Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..
 





