November 21, 2024
SGSTV NEWS
CrimeNational

Suicide: విషాదం.. భర్తతో కలిపే దహనం చేయమని..


ఎయిర్‌ఫోర్స్‌లో ఆగ్రాలో ఉద్యోగం చేస్తున్న భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణం ఎవరూ కాదని లేఖలో పేర్కొంటూ.. తన భర్తతోనే అంత్యక్రియలు జరిపించాలని లేఖలో పేర్కొంది.

ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దీన్ దయాళ్ దీప్ అనే వ్యక్తి ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా ఆగ్రాలో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే ఉండే ఓ సైనిక ఆసుపత్రలో అతని భార్య రేణు తన్వీర్ ఆర్మీ కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే వీరిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు

తల్లి ఆరోగ్యం బాలేదని..
తన్వీర్ తల్లి అనారోగ్య బారిన పడటంతో వైద్య చికిత్స కోసం ఆమె ఢిల్లీ వెళ్లింది. దీంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లిన తర్వాత దీన్‌దయాళ్ తర్వాత రోజు బయటకు రాలేదు. దీంతో తోటి ఉద్యోగులు క్వార్టర్స్‌లోని తలుపులు పగలగొట్టి చూడగా.. ఉరి వేసుకుని చనిపోయినట్లు కనిపించారు. ఈ విషయం తెలిసిన భార్య తన్వీర్ ఢిల్లోని ఓ కంటోన్మెంటులోని అధికారుల మెస్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తల్లితో ఆసుపత్రిలో ఉండగా భర్త మరణ వార్త విని.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్త లేని జీవితం తనకు వద్దని వెంటనే అతిథిగృహానికి వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె చనిపోతే ఓ లెటర్ రాసి మరణించింది. ఆ లెటర్‌ను తన్వీర్ మృతదేహం పక్కన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తన మరణానికి కారణం ఎవరు లేరని, భర్త లేని జీవితంలో ఉండలేనని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొంది. దీంతో పాటు తన భర్త మృ‌తదేహంతో కలిపి అంతిమ సంస్కారాలు చేయాలని ఆ లేఖ‌లో పేర్కొంది. అయితే 2022లో ప్రేమ వివాహం చేసుకున్న జంట.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదు. పోలీసులు ఘటనా స్థలాలని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది

Also read

Related posts

Share via