SGSTV NEWS
Andhra PradeshCrime

Students Gang War: పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు.. రచ్చలేపిన గ్యాంగ్ వార్-  చూశారా?


కృష్ణాజిల్లా ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఏజీ&ఎస్‌జి కాలేజీ సమీపంలో నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థులు బాదుకున్నారు. ఇంటర్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు.

ఇంటర్ ఫైనల్ పరీక్షలు రాసిన తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో కొందరు విద్యార్థులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. గ్యాంగ్‌లుగా ఏర్పడి పిడుగుద్దులతో రెచ్చిపోయారు. రాళ్లు విసిరి పక్కనే ఉన్న బస్సు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. నువ్వా నేనా అన్నట్లు తన్నుకున్నారు. సై అంటే సై అన్నట్లు రోడ్డు మీదే వీరంగం సృష్టించారు. ఈ ఘటన ఏపీలో తాజాగా జరిగింది.

విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఉయ్యూరు ఏజీ & ఎస్ జి కాలేజీ సమీపంలో  నడిరోడ్డు పైన కాలేజీ విద్యార్థులకు మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ముగిసిన అనంతరం విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే ఈ గొడవకు గల కారణాలు తెలియరాలేదు.

Also read

Related posts

Share this