SGSTV NEWS online
Andhra PradeshCrime

గుండెపోటుతో విద్యార్థి మృతి!



నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. మీరంతా అబద్ధాలు చెబుతున్నారు’

గుత్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ‘నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. మీరంతా అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ తడారిన గుండెతో ఆమె మాట్లాడిన మాటలతో అక్కడున్న వారందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘యా అల్లా.. ఎంత పనిచేశావయ్యా’ అంటూ చూసిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు.

గుండెపోటుతో 7వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పట్టణంలో విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని కటిక బజారులో నివాసముండే జలాల్, హసీనా దంపతులకు ఇద్దరు కుమార్తెల తర్వాత మహమ్మద్ యాసిన్ జన్మించాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఏడో తరగతి పూర్తి చేసుకున్న యాసిన్ (13) 8వ తరగతిలోకి అడుగు పెట్టాల్సి ఉంది.

మంగళవారం తెల్లవారుజామున తమ ఇంటి వద్ద ఉన్న బాత్ రూమ్ కాలు జారి కింద పడిన యాసినన్ను వెంటనే తల్లిదండ్రులు అనంతపురం తీసుకెళ్లగా.. కాసేపటికే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిన్నటి దాకా ఎంతో ఆనందంగా తమ ముందు తిరిగిన యాసిన్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Also read

Related posts