SGSTV NEWS
Andhra PradeshCrime

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఆత్మహత్య

మంత్రాలయం : అనుమానాస్పద స్థితిలో ఎపి మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామం మోడల్‌ స్కూలులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు… సుంకేశ్వరి గ్రామానికి చెందిన కురువ గుండమ్మ, గుండప్ప దంపతులకు కుమార్తె పార్వతి (16) ఉన్నారు. మోడల్‌ స్కూల్‌లోని హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి చదువుతున్నారు. అందరూ విద్యార్థులు నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గది తలుపులు తెరిచి చూసిన తోటి విద్యార్ధులు ఫ్యాన్‌కు వేళాడుతున్న పార్వతి మృతదేహాన్ని చూసి సిబ్బందికి సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంత్రాలయం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలపాలని తల్లిదండ్రులతో పాటు ఎఐఎస్‌ఎఫ్‌, రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్‌ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. విద్యార్ధిని మృతిపై దర్యాప్తు చేపట్టాలని సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Also read

Related posts