SGSTV NEWS online
Andhra PradeshCrime

నరసరావుపేట ఆక్స్‌ ఫర్డ్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య



నరసరావుపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు బాపట్ల జిల్లా నరసరావుపేట ఆక్స్‌ ఫర్డ్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. నరసరావుపేట ఆక్స్‌ ఫర్డ్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన కొరకుల బాల కోటిరెడ్డి (18)  అనే విద్యార్థి కళాశాల హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం …. మృతి చెందిన కోటి రెడ్డికి నాలుగు నెలల క్రితం హెర్నియా ఆపరేషన్ జరిగింది అని తల్లి హైమావతి వివరించారు. కాలేజీలో విద్యార్థుల వద్ద ఘర్షణ కారణంగానే తమ కొడుకు చనిపోయాడని హైమావతి ఆరోపించారు. ఈరోజు కళాశాల వార్డెన్‌ ఫోన్‌ చేసి ‘మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు’ అని చెప్పారని ‘మా అబ్బాయితో మాట్లాడాలి ఫోన్‌ ఇవ్వండి’ అని అడుగగా మళ్ళీ చేస్తామని చెప్పారని కొంత సమయం తర్వాత ‘మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు’ అని విలపించారు. సోమవారం హాస్టల్‌ గదిలో కోటిరెడ్డి ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని హాస్టల్‌ వార్డెన్‌, తోటి విద్యార్థులు గమనించే సమయానికి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడని గుర్తించారని తెలిసినట్లు చెప్పారు. కళాశాల యాజమాన్యంవారు విద్యార్థి తరపు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేసి, విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యే అని నిర్ధారించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు ఏమిటనే విషయంలో స్పష్టత లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలా లేదా ఇతర కారణాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సరైన సౌకర్యాలు, పర్యవేక్షణ లేని కారణంగా విద్యార్థుల బలవన్మరణాలు సంభవిస్తున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts