November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు : డిజిపి




అమరావతి  : సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యర్థులకు సవాలు విసురుతూ శాంతిభద్రతలకు పలువురు విఘాతం సృష్టిస్తున్నారని, అలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కొంతమంది వ్యక్తిగత ధూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు రౌడీషీట్‌ తెరుస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పోస్టుల పట్ల గ్రూప్‌ అడ్మిన్‌లు కూడా అప్రమత్తంగా వుండాలని సూచించారు. అలాంటి పోస్టులను వాట్సాప్‌ స్టేటస్‌లలో పెట్టుకోవడం, మరొకరికి షేర్‌ చేయడం నిషిద్ధమని తెలిపారు. రాష్ట్రంలో సోషల్‌ మీడియా పోస్టులపై పోలీస్‌శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు

Also read

Related posts

Share via