గర్ల్ ఫ్రెండ్ ను బయటకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్ కు నచ్చిన గిఫ్ట్ ను , డ్రెస్ ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో వెలుగుచచూసింది.
ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు తన స్నేహితుడి లవర్ ని కొత్త కారులో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లడంలో సాయం చేయాలనుకున్నారు. అయితే ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేశారు. షోరూమ్ నుంచి కొత్త కారును దొంగిలించేందుకు మగ్గురు స్నేహితులు శ్రేయ్, అనికేత్ నగర్, దీపాంశు భాటీ కలిసి స్కెచ్ వేశారు.
సెప్టెంబర్ 26న గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్ లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేయమని ఇద్దరు అడిగారు. వారు హెల్మెట్లు ధరించి, ఎగ్జిట్ గేట్ పక్కన నిలబడి ఉండగా, డ్రైవింగ్ చేస్తున్న కారు డీలర్ పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీయడంతో ఇద్దరూ కారులో ఎక్కారు. వారిలో ఒకరు డ్రైవర్ సీటు పక్కన కూర్చోగా, మరొకరు వెనుక కూర్చొని న్నారు.అనంతరం కారు డీలర్ ని హ్యుందాయ్ వెన్యూ నుంచి బయటకు నెట్టివేసి వేగంగా వెళ్లిపోయారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100కి పైగా సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి, నిందితులను కనిపెట్టారు. అయితే ఈ ఘటన గత నెలలో జరిగిప్పటికీ.. కేసు విచారణలో దొంగతనానికి గల కారణం తాజాగా వెలుగుచూసింది.
Also read
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..





