ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయ ప్రాంగణంలోని మల్లికా గుండంలో చండీశ్వరునికి అవబృద స్నానం, త్రిశూల స్నానం క్రతువులు జరిపారు.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ,అమ్మవార్లకు అశ్వవాహన సేవ నిర్వహించారు.ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆసీనులను చేయించారు. ఆలయ అర్చకులు,వేద పండితులు ప్రత్యేక అలంకరణ, పూజాదికాలు నిర్వహించి హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబా దేవి నిజరూపంలో దర్శనమిచ్చారు. అష్ట భుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు ,గద, ఖడ్గం, విల్లు ,డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చారు. అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్నీ తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయిని శాస్త్రాలు చెబుతున్నాయి. అశ్వవాహనాదీసులైన స్వామి అమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తొలగుతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని పండితులు పేర్కొన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025