శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయో… సరి, బేసి, శూన్యం ఉంటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకోండి
Sri Viswavasu Nama Samvatsaram 2025-2026: శ్రీ క్రోధి నామ సంవత్సరాన్ని పూర్తిచేసుకుని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. తెలుగు సంవత్సరాలు 60 లో ఇది 39వది. ఈ ఏడాదిలో మీకు ఏ నెలలు కలిసొస్తాయి..ఏ నెలలు ఇబ్బంది పెడతాయి.. ఏ నెలలో శూన్య ఫలితాలున్నాయో తెలిపేవే కందాయ ఫలాలు.
కందాయ ఫలాలను నక్షత్రాల ప్రకారం చెబుతారు. మీ నక్షత్రం ప్రకారం మీ కందాయ ఫలం ఎలా చూసుకోవాలో తెలుసా…
నాలుగు నెలలు చొప్పున ఓ ఫలితం ఉంటుంది.
2025 ఏప్రిల్, మే, జూన్, జూలై
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్
డిసెంబరు, 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి
కందాయ ఫలితాలు 3 రకాలు (సరి, బేసి, శూన్య) ఉంటాయి.
కందాయ ఫలాల్లో బేసి సంఖ్య ఉంటే నా 4 నెలలు ధనలాభం
కందాయ ఫలాల్లో సరి సంఖ్య ఉంటే ఆ 4 నెలలు సమఫలం
కందాయ ఫలాల్లో సున్నా ఉంటే ఆ 4 నెలలు శూన్య ఫలితం
మొదట్లో సున్నా ఉంటే మొదటి 4 నెలలు భయాందోళనలు
మధ్యలో సున్నా ఉంటే మధ్య 4 నెలలు బుణబాధలు, అవమానాలు
చివర్లో సున్నా ఉంటే చివరి 4 నెలలు ధననష్టం, శత్రుభయం
(నక్షత్రం పక్కనే ఇచ్చిన మూడు ఫలితాల్లో సరి, బేసి, సున్నా ఆధారంగా మొదటి 4 నెలలు, రెండో 4 నెలలు, చివరి 4 నెలలు మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకోవచ్చు)
నక్షత్రం కందాయఫలం
అశ్వని 3 -0- 4
భరణి 6 -1- 1
కృత్తిక 1 -2 -3
రోహిణి 4 -0 -0
మృగశిర 7- 1- 2
ఆరుద్ర 2 -2- 4
పునర్వసు 5 -0- 1
పుష్యమి 0-1 -3
ఆశ్లేష 3- 2 -0
మఖ 6- 0- 2
పూర్వఫల్గుణి 1- 1 -4
ఉత్తరఫల్గుణి 4 -2 -1
హస్త 7 -0 -3
చిత్త 2 -1 -0
స్వాతి 5 – 2 -2
విశాఖ 0 – 0 -4
అనూరాధ 3 – 1 -1
జ్యేష్ట 6 -2 -3
మూల 1- 0- 0
పూర్వాషాఢ 4 – 1 -2
ఉత్తరాషాఢ 7 – 2 -4
శ్రవణం 2 – 0 -1
ధనిష్ట 5 – 1 -1
శతభిషం 0 – 2 -0
పూర్వాభాద్ర 3 – 0 -2
ఉత్తరాభాద్ర 6 – 1 -4
రేవతి 1 – 2 – 1
2025 మార్చి 30 ఉగాది
మార్చి 29 శనివారం అమావాస్యతో క్రోధి నామ సంవత్సరం పూర్తవుతుంది… మార్చి 30 ఆదివారం నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది
Also read
- ATM చోరీ కోసం యత్నించిన దొంగలు! ఊహించని ట్విస్ట్‌తో పరుగో పరుగు
- అయ్యో పాపం.. పసిబిడ్డను బలితీసుకున్న పందికొక్కులు! కన్నీళ్లు పెట్టించే ఘటన
- ఎన్నిసార్లు పిలిచినా ప్రియుడు ఇంటికి రాలేదని.. వివాహిత ఆత్మహత్య?
- Shani Rahu Yuti: 30 ఏళ్ల తర్వాత శని-రాహువు సంయోగంతో పిశాచ యోగం.. ఈ 5 రాశుల వారి జీవితం సమస్యల సుడిగుండం..
- Astrology remedies: పూజలు, హోమాలు అక్కర్లేదు.. మూగజీవాలకు ఈ ఆహారం పెడితే సిరి సంపదలు మీ వెంటే..