లావణ్య, మస్తాన్ సాయి వివాదం సినీ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. మస్తాన్ హార్డ్ డిస్క్‌లో 300 అమ్మాయిల, సినిమా వాళ్ల నగ్న వీడియోలున్నట్లు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలున్నట్లు తెలుస్తుండగా పోలీసులు పరిశీలిస్తున్నారు.
Mastan Sai Arrest: సినీ ఇండస్ట్రీకి చెందిన లావణ్య (Lavanya)మరోసారి సంచలన ఆరోపణలో వార్తల్లోకెక్కింది. అప్పట్లో హీరో రాజ్ తరుణ్(Hero Raj Tharun) భార్యగా చెప్పుకుంటూ నానా హంగామా చేసిన లావణ్య తాజాగా మస్తాన్ సాయి(Masthan Sai) అనే వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకోగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి ప్రైవేట్ వీడియోలు లీక్(Private Videos Leak) చేశాడని, హీరో నిఖిల్(Hero Nikhil), ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy) ఫోన్లను హ్యాక్ చేసినట్లు సమాచారం.
బెడ్‌రూముల్లో స్పై కెమెరాలు..
మస్తాన్ దగ్గర హీరో నిఖిల్ పర్సనల్ వీడియోలు ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఓ హీరోయిన్ ప్రైవేటు వీడియోలు కూడా ఉన్నాయని తెలుస్తుండగా మస్తాన్ తీరుతో ఫిల్మ్ ఇండస్ట్రీ(Telugu Film Industry) మరోసారి షేక్ అవుతోంది. అంతేకాదు సెలబ్రిటీల బాత్‌రూమ్, బెడ్‌రూముల్లో స్పై కెమెరాలు పెట్టి రహస్యంగా వీడియోలు రికార్డు చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది
వందలకొద్ది నగ్న వీడియోలు
ఆ హార్డ్ డిస్క్ లో మహిళలకు తెలియకుండా తీసిన వందలకొద్ది నగ్న వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది పెళ్లి అయిన మరికొంతమంది పెళ్లికాని వారి నగ్న వీడియోలు కూడా ఉన్నాయట. మస్తాన్ సాయి యువతుల ఫోన్లు హాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్, గూగుల్ ఫోటోస్, ఐ క్లౌడ్ అకౌంట్స్ తన ఆదీనంలో పెట్టుకొని ఎవరు ఎదురుతిరగలేని పరిస్థితికి తీసుకొస్తాడట. ఎవరైనా ఎదురుతిరిగితే కుటుంబం పరువుపోతుంది, జీవితాలు నాశనం చేస్తానని భయపెట్టిస్తాడట. దీంతో ఆడపిల్లలు మౌనంగా భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆడిపిల్లల శరీరంలో సెక్స్ కోరికలను పెంచే డ్రగ్స్ ఎక్కించి వారికీ తెలియకుండా కొన్ని వీడియోలు రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసాడట. కొంతమందిని పెళ్లి చేసుకుంటానని, మరికొంతమందిని తప్పు చేశాను ఉరి వేసుకొని చచ్చి పోతానంటూ బ్లాక్ మెయిల్ చేసి కేసులు పెట్టకుండా జారుకుంటాడట.
నిఖిల్ ప్రైవేట్ వీడియోలు..
ఈ కేసులో ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మస్తాన్ సాయి రికార్డు చేసుకున్నట్లు సమాచారం. అలా దాదాపు 300 వీడియోలను మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్‌లో దాచగా.. టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ పేరు బలంగా వినిపిస్తోంది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో నిఖిల్ ప్రైవేట్ పార్టీలకు సంబంధించి వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. నిఖిల్ ఎంతోమంది మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు, అదంతా ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు సమాచారం. అలాగే నిఖిల్ ఫోన్ హ్యాక్ చేసి మస్తాన్ పలు వీడియోలను తనవద్ద ఉంచుకున్నట్లు తెలుస్తోంది
నాకు ప్రాణహాని తప్పదు..
మరోవైపు తనను చంపి హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్లాలని మస్తాన్ సాయి ప్లాన్ చేసినట్లు లావణ్య చెబుతోంది. ఈ హార్డ్ డిస్క్ పోలీసులకు ఇచ్చినా సరే నాకు ప్రాణహాని తప్పదు. కానీ ఇలాంటి వెదవలు తీసే వీడియోల వల్ల నాలాంటి ఆడపిల్లలు బలికాకూడదు. నాకు న్యాయం జరిగినా జరగకపోయినా కనీసం ఈ ఫిర్యాదు చూసి మహిళలు జాగ్రత్త పడాలి. పోలీసుల పట్ల పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఫిర్యాదు చేశాను. అన్ని ఆధారాలు ఉన్న హార్డ్ డిస్క్ అందించాను. అలాగే మస్తాన్ సాయి వద్ద ఉన్న మిగిలిన రెండు హార్డ్ డిస్క్ లు, అతని ఇమెయిల్ అకౌంట్స్, ఆపిల్ క్లౌడ్ అకౌంట్స్, అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్ లు పోలీసులు అదుపులోకి తీసుకొని మహిళల డేటా అంతా డిలీట్ చేయాలని కోరింది. ఇప్పటికే మస్తాన్ పై పలు సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేశారు.
Also read
- Mastan Sai Arrest: సెలబ్రిటీల బాత్‌రూమ్, బెడ్‌రూముల్లో స్పై కెమెరాలు.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌తో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ!
- ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..