July 1, 2024
SGSTV NEWS
CrimeNational

Sachin Tendulkar: ఆత్మహత్య చేసుకున్న సచిన్ సెక్యూరిటీ గార్డ్.. తుపాకితో కాల్చుకుని..

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, భారతరత్న సచిన్ టెండూల్కర్ భద్రత కోసం అపాయింట్ చేసిన ఓ సైనికుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సచిన్ భద్రతలో నిమగ్నమైన సైనికుడు ‘స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్’ (SRPF)కి విభాగానికి చెందిన వాడు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, మహారాష్ట్రలోని జల్గావ్‌లోని జామ్నేర్‌లో నివాసం ఉంటున్న ఒక సైనికుడు తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సెలవుపై స్వగ్రామానికి వెళ్లిన జవాన్‌ను ప్రకాష్ కపాడేగా గుర్తించారు. ఈ సంఘటన రాత్రి 2:00 గంటలకు జరిగిందని, ఆత్మహత్య చేసుకున్న సైనికుడి పేరు ప్రకాష్ గోవింద్ కప్డే అని ఒక అధికారి తెలిపారు. అతని వయస్సు 40 సంవత్సరాలు. జవాన్ కుటుంబంలో అతని వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతను తన గ్రామంలో నివసిస్తున్నాడు.

సచిన్ టెండూల్కర్‌కు భద్రతా బాధ్యతలు..
పోలీసులు అందిన సమాచారం ప్రకారం ప్రకాష్ 2009 బ్యాచ్ కు చెందిన సైనికుడు. అతని పోస్టింగ్ స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ అంటే SPUలో ఉంది. సచిన్ టెండూల్కర్‌ను రక్షించడం అతని డ్యూటీ. ప్రకాష్ ఆత్మహత్యపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాష్‌కు పోస్ట్‌మార్టం నిర్వహించి తదుపరి దర్యాప్తుపై నిర్ణయం తీసుకోనున్నారు. చనిపోయిన సైనికుడి గురించి తెలిసిన వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు

మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు..
జామ్నర్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ షిండే మాట్లాడుతూ,”ప్రాథమిక విచారణ ప్రకారం, జవాన్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మేం దర్యాప్తు పూర్తి వివరాల కోసం వేచి ఉన్నాం” అంటూ తెలిపారు. కపడా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Also read

Related posts

Share via