SGSTV NEWS
Lifestyle

మూడు బాటల దగ్గర వేసిన నిమ్మకాయలు దాటితే ఏమవుతుంది…?



ఈ నమ్మకాలు శాస్త్రీయంగా నిరూపించకపోయినా, మన సంస్కృతిలో సేఫ్టీ హెచ్చరికల్లా రూపుదిద్దుకున్న విశ్వాసాలే. పెద్దలు చెప్పిన మాటల వెనుక భయపెట్టే భావం పక్కనపెడితే.. జాగ్రత్తగా ఉండాలి అనే సారాంశమే ఎక్కువగా ఉంది. తద్వారా మనం పాటించాలా లేదా అన్నది పూర్తిగా మన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.



మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు,పసుపు, కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు.. ఇలా చెప్పిన మాటలు చిన్నప్పటి నుంచే మనకు చెవిన పడుతుంటాయి. కానీ అసలు కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?. పాతకాలంలో జ్యోతిష్యం, శాస్త్రం, భక్తి అన్నీ కలగలసి జీవన విధానం ఉండేది. చెడు శక్తులు దరిచేరకుండా ఉండాలని నమ్మిన పెద్దలు నిమ్మకాయలు, మిరపకాయలు ఉపయోగించి దిష్టి తీసే పద్ధతిని పాటించేవారు. దిష్టి తీయడం పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయలు, మిరపకాయలను దూరంగా పడేసేవారు. అవి చెడు శక్తులను గ్రహించాయని నమ్ముతారు. అందుకే వాటిని తొక్కితే లేదా దాటితే ఆ నెగటివ్ ఎనర్జీ మన మీదకు వస్తుందని, మనకు దుష్ప్రభావం కలుగుతుందని పెద్దలు హెచ్చరిస్తూ ఉండేవారు.

“మూడు బాటల దగ్గర దయ్యాలు తిరుగుతాయి” అన్న మాటలు కూడా ఆ నమ్మకాల నుంచే వచ్చాయి. ఆ ప్రాంతాలు పాతకాలంలో వెలుతురు లేక చీకటిగా ఉండేది. జంతువులు, పాములు తిరుగుతూ ఉండేవి. ఆ ప్రమాదాలనుంచి రక్షించేందుకు ప్రజలను భయపెట్టి దూరంగా ఉంచే ప్రయత్నం చేశారని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఆ నమ్మకానికి వెనుక భయపెట్టే పద్ధతిలో ఇచ్చిన జాగ్రత్త హెచ్చరికే అసలు ఉద్దేశం.



రోడ్డుపై ఉన్న నిమ్మకాయలు, కాలిన కట్టె, చనిపోయిన జంతువు, వెంట్రుకలు, ఆహార అవశేషాలు, గాజులు, పసుపు, కుంకుమ, కర్పూరం, చిరిగిన బూట్లు, నల్ల దుస్తులు.. వీటిపై దాటకూడదని చెబుతారు. వీటివల్ల చెడు గ్రహాల ప్రభావం లేదా దుష్టశక్తుల ప్రభావం చేరుతుందని వారు అంటారు. శాస్త్రీయంగా చూస్తే వీటికి సంబంధించి నిర్ధారిత ఆధారాలు లేవు. కానీ నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కితే వాటి రసాయనాలు చర్మానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఆహార భద్రత, పరిశుభ్రత దృష్ట్యా తొక్కకపోవడమే మంచిదని వైద్యులు అంటున్నారు

Also read

Related posts