SGSTV NEWS online
Spiritual

గురువారం అరటి చెట్టును ఎందుకు పూజించాలి? దీని వెనుకున్న రహస్యం తెలుసా?



హిందూ ధర్మంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ గురు వారం వచ్చింది అంటే చాలు అరటి చెట్టును పూజిస్తూ ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు గురువారం రోజున అరటి చెట్టును ఎందుకు పూజిస్తారో, కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

చాలా మంది తమకు అదృష్టం కలిసి రావాలి అని కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పూజిస్తూ ఉంటారు. అయితే అందులో అరటి మొక్క కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అరటి మొక్కకు చాలా ప్రత్యేకమైన శఖ్తులు ఉంటాయంట. ఇది గురు గ్రహానికి సంబంధించినది. అందువలన దీనిని గురువారం రోజు పూజించడం వలన జాతకంలో గురు గ్రహం బలపడుతుంది

అంతే కాకుండా అరటి చెట్టు పూజించడం వలన విష్ణు మూర్తి ఆశీస్సులు కూడా లభిస్తాయని చెబుతున్నారు పండితులు. గురువారం రోజున అరటి చెట్టును పూజించడం చాలా శుభప్రదం. ఇది జాతక పరంగా, అద్భుతంగా కలిసి వస్తుందంట. చాలా వరకు అరటి చెట్టు ఆకులను పూజ సమయంలో తోరణంగా ప్రధాన ద్వారం వద్ద పెటడం చేస్తుంటారు. అంతే కాకుండా ఆహారం కూడా అరటి ఆకుల్లో సమర్పించి, నైవేద్యంగా స్వీకరిస్తారు.

అందువలన అరటి చెట్టును పూజించడం చాలా మంచిదంట. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే గురు గ్రహం బలహీనంగా ఉంటుందో, వారు గురు వారం రోజున అరటి చెట్టును పూజించి, మొక్కకు, పసుపు, కుంకుమ సమర్పించాలంట. దీని వలన గురు గ్రహం అనుగ్రహంతో పాటు, విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా లభిస్తాయంట.

అంతే కాకుండా ఇంటిలో అరటి మొక్క నాటడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయంట. ఇది సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. వారం రోజుల్లో ఒక్కసారి అరటి మొక్కను పూజించడం వలన ప్రతికూలతలు తొలిగిపోయి, జీవితం ఆనందంగా సాగిపోతుంది. జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయంట.


Related posts