వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. డబ్బులాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచడం వల్ల డబ్బు కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. లాఫింగ్ బుద్దతో శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు. లాఫింగ్ బుద్ధాను ఉంచడం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. ఇంట్లో వ్యక్తుల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి.
లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచితే కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండొచ్చు. లాఫింగ్ బుద్ద ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నిత్యం ఆనందంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంచితే దంపతుల మధ్య సంబంధాల్లో సామరస్యం పెరుగుతుంది. గొడవలు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు. లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి.
ఎవరైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని బహుమతిగా ఇస్తే, ఈ విగ్రహాన్ని సంతోషంగా స్వీకరించాలి. బహుమతిగా లాఫింగ్ బుద్ధ విగ్రహం మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మీరే కొనుగోలు చేయకూడదని చెబుతుంటారు. ఎందుకంటే స్వయంగా కొనుగోలు చేసిన లాఫింగ్ బుద్ధ విగ్రహం అంత ప్రభావవంతంగా ఉండదని అంటూ ఉంటారు. ఇకపోతే, లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండాలి. తూర్పు వైపున లాఫింగ్ బుద్దుని పెట్టడం శుభప్రదంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని వాస్తు చెబుతోంది.
లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంచితే పిల్లలు ఆనందంగా ఉంటారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంచడం వల్ల ఉద్యోగులకు మేలు కలుగుతుంది. వ్యాపారంలో విజయాలు దక్కుతాయి. ఏ దిశలో పెట్టాలి?వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధాను ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పెట్టొచ్చు. లేదా తూర్పు, ఉత్తర దిశల్లో పెట్టడం మంచిది
