వార ఫలాలు (ఆగస్టు 23- 29, 2026): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. మిథున రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో మీ పని తీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు బలంతో పాటు, రవి, బుధ, కుజుల బలం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారం రోజుల పాటు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి అపార ధన లాభం కనిపిస్తోంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనుల్ని సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్త వుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. సామాజిక సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులు, మానసిక ఒత్తిడి తప్పక పోవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో రవితో కలవడం, గురువు ధన స్థానంలో సంచారం చేస్తు న్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో మీ పని తీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అధికార యోగానికి కూడా అవ కాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో పురోగతి చెందుతారు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించడం మంచిది. విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వల్ల, ధన స్థానంలో సంచరిస్తున్న బుధ, రవుల వల్ల ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికర ఫలితాలని స్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. పెండింగ్ పనులను అవరో ధాలు లేకుండా పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రత్యేకతను నిరూపించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
లాభ స్థానంలో కుజుడు, సొంత రాశిలో రవి, బుధుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగి పోతాయి. ఉద్యోగానికి సంబంధించి చేసే ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో మాట తొందర వల్ల ఇబ్బందుల పడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా పురోగమి స్తాయి.కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అనుకోకుండా శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి, ఉద్యోగ స్థానాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభ స్థానంలో కుజ సంచారం వల్ల ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ప్రాభవం, ప్రాధాన్యం పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పని తీరు అధికారులకు బాగా నచ్చుతుంది. ఉద్యోగం మార డానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా రాణిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గురు, బుధ, రవి, కుజ గ్రహాల అనుకూలత వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరు తాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకు, కొత్త కార్యక్రమాలకు సమయం కలిసి వస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి, దశమ స్థానంలో రవి, బుధులు, లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వారమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, ప్రశాంతంగా పురోగమిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు ఆర్థిక సహాయం చేయడం కూడా జరుగుతుంది. స్నేహితుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు తేలికగా విజ యాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
భాగ్య స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. రాశ్యధిపతి గురువు అనుకూల స్థానంలో లేనందువల్ల అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద కూడా ఖర్చు పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్త వుతాయి. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో ఊహించని విధంగా రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు ఘనవిజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని, సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో గురువు సంచరిస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. చేపట్టిన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో ప్రవేశించడం జరుగుతుంది. ప్రయాణాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సప్తమ స్థానంలో ఉన్న రవి, బుధుల వల్ల సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండకపోవచ్చు. శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వ్యక్తి గత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. అన్ని విధాలుగానూ అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమా జంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెల కొంటాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యా ర్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గి శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ, కీలక వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉంది. తల్లితండ్రుల జోక్యంతో కుటుంబ వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సామ రస్య వాతావరణం నెలకొంటుంది. కొందరు మిత్రుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..





