వార ఫలాలు (ఆగస్టు 10-16, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృషభ రాశి వారికి ఖర్చులకన్నా ఆదాయం బాగా అధికంగా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో మాత్రం ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శుక్ర, రాహువు, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను సమర్థవంతంగా, సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి వస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమయ స్ఫూర్తితో వ్యవహరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద కాస్తంత శ్రద్ద పెట్టడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): గురు, శుక్ర, శని, రవుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల రాజపూజ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఖర్చులకన్నా ఆదాయం బాగా అధికంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్తగా వాహనం కొనే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశిలో గురు, శుక్రులు, ధన స్థానంలో బుధ, రవుల సంచారం వల్ల వారమంతా హ్యాపీగానే గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో మాత్రం ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. ఆదాయ వృద్ధికి సరైన ప్రయత్నాలు చేయడంతో పాటు, కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశిలో బుధ, రవుల సంచారంతో పాటు తృతీయ స్థానంలో కుజ సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగు తాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుం టారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో గురు, శుక్రులు, ధన స్థానంలో కుజ సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. కొన్ని ప్రయత్నాలు, పనులు, వ్యవహారాలు చురు కుగా ముందుకు సాగుతాయి. బంధువులు నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల వల్ల సమ స్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే సూచనలున్నాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం శ్రేయస్కరం. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశివారికి దశమ స్థానంలో గురు, శుక్రులు, లాభ స్థానంలో రవి, బుధులు ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి, జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. బంధుమిత్రులతో సఖ్యత మరింత వృద్ధి చెందుతుంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు గురువుతో కలిసి ఉండడం, దశమ స్థానంలో రవి, బుధులు యుతి చెందడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ ప్రయ త్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొందరు మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెడతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): భాగ్య స్థానంలో రవి, బుధుల కలయిక, లాభ స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల ఆదా యం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రారంభించిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడడం మంచిది కాదు. ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును, బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): తృతీయంలో రాహువు, సప్తమంలో గురు, శుక్రులు, దశమంలో కుజుడి సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. జీతాలు బాగా పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. తండ్రి తరఫు వారితో ఆస్తి వివాదాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో సామరస్య వాతావరణం కొనసాగుతుంది. చేపట్టిన పనుల్లో విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలు బాగానే లాభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): తృతీయంలో శని, సప్తమ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు, రావలసిన డబ్బు కూడా సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా పని ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): పంచమ స్థానంలోని గురు, శుక్రుల వల్ల ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గుతుంది. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతల నిర్వహణలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవ హారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. మీ దగ్గర నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును జాగ్రత్తగా వసూలు చేసుకుంటారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు శుక్రుడితో చతుర్థ స్థానంలో కలిసి ఉండడం వల్ల వారం రోజుల జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. పంచమంలో ఉన్న రవి, బుధుల వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా బాగా ధన లాభం పొందుతారు. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025