వార ఫలాలు (మే 4-10, 2025): మేష రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారమంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అదనపు ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
శుభ గ్రహాల అనుకూలత వల్ల వారం రోజుల పాటు జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త ప్రయత్నాలను, కార్యక్రమాలను చేపట్టడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకోకుండా బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. భాగ్య, లాభ స్థానాల్లో శుభ గ్రహాల స్థితి వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. అయితే, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం, ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సమాజంలో కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఎదురుచూడని గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు విశేషమైన ప్రయోజనాలు పొందు తారు. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధార పడతారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం వృద్ధి చెందుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి సంబంధమైన శుభవార్తలు వింటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగా సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోతారు. ప్రేమ వ్యవ హారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వారమంతా ఆర్థికంగా బాగా గడిచిపోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీ సమర్థతకు, పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామి తరఫు నుంచి సంపద పెరుగుతుంది. కొందరు బంధుమిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు, రావ లసిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ది పొందుతారు. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. వ్యక్తి గతంగా కొన్ని చిన్నా చితకా సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి నెలంతా సానుకూలంగానే సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. కొద్ది శ్రమతో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూ లంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారాలు కూడా లాభాల పరంగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, వ్యయ ప్రయాసలుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఇంటా బయటా ఆదరాభిమానాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయపరంగా ప్రతి ప్రయత్నమూ తప్ప కుండా సత్ఫలితాలనిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులపై బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి లోటుండదు. అనవసర ఖర్చుల విషయం జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలుంటాయి. ప్రతి ముఖ్యమైన వ్యవహారంలోనూ కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యో గావకాశాలు లభిస్తాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. సహోద్యో గులు ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెంచుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. శ్రమ, ఒత్తిడి, తిప్పట పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అను కున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి. కొందరు సమీప బంధువుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దైవ సంబంధమైన వ్యవహారాల్లో పాలుపంచుకోవడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. కుటుంబంలో కొద్దిపాటి ఆందోళన, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. నష్టదాయక వ్యవహారాలను పెట్టుకోకపోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సల హాలు బాగా ఉపయోగపడతాయి. ఉద్యోగాల్లో సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. పిల్లల నుంచి తరచూ శుభవార్తలు వింటారు. అధికారులకు, బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు
Also read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..
- చూసేందుకది అరటి గెలల లోడ్.. కాస్త దగ్గరికెళ్లి చూడగా షాకింగ్ సెటప్! పుష్పని మించిపోయారు సామీ..
- మోడలింగ్ కంటెస్ట్ అంటే అమ్మాయి ఫోటోలు పంపింది.. కట్ చేస్తే బుర్రగిర్రున తిరిగే షాక్
- Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..
- Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం
- Telangana: ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. తెలియక భార్య ఏం చేసిందంటే?