ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం. ఈ గ్రహణం గురించి తెలుసుకునేందుకు ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రహణం ఏ సమయంలో సంభవిస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. అటువంటి పరిస్థితిలో 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుందో ఈ రోజు తెలుసుకుందాం..
సంవత్సరంలో మొదటి గ్రహణం హోలీ రోజున అంటే మార్చి 14న సంభవించింది. అది చంద్రగ్రహణం. ఇప్పుడు దీని తరువాత సంవత్సరంలో రెండవ గ్రహణం మార్చిలోనే ఏర్పడనుంది. ఈ గ్రహణం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అవుతుంది. ఇది మార్చి 29వ తేదీ చైత్ర మాసం ప్రారంభానికి ఒక రోజు ముందు సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో భూమిలోని కొన్ని ప్రాంతాలు పగలు.. కొన్నిప్రాంతాలు చీకటితో కప్పబడి ఉంటాయి. సూర్యగ్రహణాన్ని చూడటానికి ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏ సమయంలో సంభవిస్తుంది తెలుసుకుందాం..
భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా.. లేదా
ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ శనివారం రోజున సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం మార్చి 29న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఇది పాల్గుణ మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం.
సూర్యగ్రహణం ఏఏ దేశాల్లో కనిపిస్తుందంటే
ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం బెర్ముడా, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, మొరాకో, గ్రీన్‌ల్యాండ్, ఫిన్లాండ్, బార్బడోస్, ఉత్తర రష్యా, స్పెయిన్, సురినామ్, కెనడా తూర్పు ప్రాంతాలు, స్వీడన్, పోలాండ్, పోర్చుగల్, లిథువేనియా, హాలండ్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ సహా అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది.
సూర్య గ్రహణం సూత సమయం
అయితే.. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా దాని సూతక కాలం భారతదేశంలో చెల్లదు. అయితే ఈ గ్రహణం కనిపించే ప్రాంతాలలో సూర్యగ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు గ్రహణం సూతక కాలం ప్రారంభమవుతుంది
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





