SGSTV NEWS
Spiritual

Lord Shiva Puja: శివుడు అభిషేక ప్రియుడు.. అభిషేకం, రుద్రాభిషేకం మధ్య తేడా ఏమిటో తెలుసా..

 

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి అభిషేకం చేయడం వలన హృదయాన్ని, ఆత్మను శుద్ధి చేస్తుందని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకనే శివ భక్తులు హర హర మహాదేవ అంటూ నీటిని సమర్పిస్తారు. అభిషేకానికి సాధారణంగా పాలు, పెరుగు, తేనె, గంధం, నీరు వంటి ద్రవ్యాలు ఉపయోగిస్తారు. అయితే ప్రజలు జలాభిషేకం, రుద్రభిషేకం ఒకటేనని భావిస్తారు. అయితే రెండింటి మధ్య తేడా ఉంది. జలాభిషేకం, రుద్రాభిషేకం మధ్య ఏమిటో తెలుసుకుందాం


ఉత్తరాదివారు శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెల భక్తి, తపస్సు, ఉపవాసం, శివారాధనల సంగమం . ఈ సమయంలో దేశంలోని అన్ని శివాలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఉపవాసం ఉంటారు. లక్షలాది మంది కావడి యాత్రని నిర్వహింఛి గంగాజలం తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తారు. శ్రావణ మాసంలో మాత్రమే కాదు సోమవారం సహా పండగలు, పర్వదినాల్లో శివలింగానికి నీటిని సమర్పించే సంప్రదాయం ఉంది. దీనిని జలాభిషేకం అని అంటారు . దీనితో పాటు మరొక ప్రత్యేక పద్ధతి రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. దీనిని వేద మంత్రాలు, ప్రత్యేక పదార్థాలతో నిర్వహిస్తారు. అయితే చాలా మంది జలాభిషేకాన్ని, రుద్రాభిషేకాన్ని ఒకేలా భావిస్తారు. అయితే ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఉంది. రుద్రాభిషేకం, జలాభిషేకం మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం.

జలాభిషేకం అంటే ఏమిటి ?

జలాభిషేకం అంటే శివుడిని నీటితో అభిషేకించడం. శివుని పూజ సమయంలో శివలింగానికి చల్లదనాన్ని అందించడానికి నీటిని సమర్పిస్తారు. శివలింగానికి జలాభిషేకం చేయడం అనేది భక్తులు ఇంట్లో కూడా చేయగలిగే సరళమైన, సాధారణ ఆచారం. జలభిషేకం ముఖ్యంగా సోమవారంతో పాటు పండగలు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహిస్తారు.

రుద్రాభిషేకం అంటే ఏమిటి ?

రుద్రాభిషేకంలో బ్రాహ్మణులు వేద మంత్రాలను జపిస్తూ, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, స్వచ్ఛమైన నీటితో శివలింగాన్ని అభిషేకిస్తారు. రుద్రాభిషేక పూజ ప్రధానంగా మానసిక ప్రశాంతత, గ్రహ దోషాల నుంచి శాంతి, సంతాన ఆనందం, వ్యాధుల నుండి విముక్తి , కోరికలు నెరవేరడం కోసం చేస్తారు. ఇంట్లో రుద్రాభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని ఉత్తర దిశలో ఉంచాలి. పూజ చేసేటప్పుడు అభిషేకం తూర్పు దిశకు ఎదురుగా ఉంచాలి.

ఈ విషయాలను విస్మరించవద్దు

1  శివుని పూజలో తులసి దళాలను ఉపయోగించడం నిషిద్ధం కనుక వాటిని ఉపయోగించవద్దు.

2  శివలింగ అభిషేకం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు.

3  జలభిషేకం లేదా రుద్రభిషేకం చేసేటప్పుడు మంత్రాలను వక్రీకరించి అంటే తప్పుగా ఉచ్చరించవద్దు.

4  రుద్రాభిషేకానికి రాగి పాత్రలో నీటిని వేసి ఉపయోగించడం శుభప్రదం .

5  రుద్రాభిషేక సమయంలో రుద్రాష్టాధ్యాయి లేదా వేద మంత్రాలను జపించాలి .

Related posts

Share this