శరత్ పున్నమి నాడు లక్ష్మీదేవిని , చంద్రుడిని పూజించడమే కాదు… ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు కుటుంబానికి ఆనందం కూడా కలుగుతుంది. అనారోగ్యం , వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి, చంద్రుని ఆశీస్సులు పొందడానికి చాలా శుభప్రదంగా భావిస్తారు. శరత్ పౌర్ణమి రోజున ఏమి దానం చేయడం వలన ఏ శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..
శరత్ పూర్ణిమ పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని కోజాగరి పూర్ణిమ, రాస పూర్ణిమ, కాముడి పున్నమి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం సంవత్సరంలో చంద్రుడు దాని పూర్తి వైభవంలో ఈ పున్నమి రోజున ఉంటాడు. అందుకనే ఈ రోజున చంద్ర కిరణాలు అమృతం వంటి దైవిక ఔషధ గుణాలతో నిండి ఉంటాయని నమ్మకం.
శరత్ పున్నమి రోజు సంపద, శ్రేయస్సు దేవత అయిన లక్ష్మీ దేవికి, విశ్వ రక్షకుడైన విష్ణువుకు, చంద్రునికి అంకితం చేయబడింది. శరత్ పూర్ణిమ రాత్రి, లక్ష్మీ దేవి భూమిపై తిరుగుతుందని.. తనను పూజించే భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపిస్తుందని నమ్ముతారు. పూజలు, ప్రార్థనలతో పాటు, ఈ రోజున దానధర్మాలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ శుభ సందర్భంగా దానం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని.. పేదరికం తొలగిపోతుందని నమ్ముతారు.
శరత్ పూర్ణిమ 2025 తేదీ , శుభ సమయం
శరత్ పూర్ణిమ 2025 తేదీ: అక్టోబర్ 06, 2025, సోమవారం
పూర్ణిమ తిథి ప్రారంభం: 06 అక్టోబర్ 2025 మధ్యాహ్నం 12:23 గంటలకు
పూర్ణిమ తిథి ముగింపు: 07 అక్టోబర్ 2025 ఉదయం 9:16 గంటలకు
పౌర్ణమి తేదీ అక్టోబర్ 6న ప్రారంభమై.. అదే రోజున చంద్రోదయం కూడా జరుగుతుంది. కనుక శరత్ పూర్ణిమ ఉపవాసం, పూజలు 2025 అక్టోబర్ 6 సోమవారం మాత్రమే చేయాల్సి ఉంటుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వేటిని దానం చేయాలంటే.. !
👉 బియ్యం, ధాన్యం: శరత్ పూర్ణిమ రోజున బియ్యం దానం చేయడం వల్ల చంద్రుని ఆశీస్సులు లభిస్తాయి. చంద్రుడిని శాంతి, ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తారు. బియ్యం దానం చేయడం వల్ల ఆ ఇంట్లో ఆహారానికి కోరతనేది ఉందని.. ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం. ఇంకా గోధుమలు దానం చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి.
👉 దీపాలు వెలిగించడం: ఈ పవిత్ర పండుగ రోజున దీపాలను వెలిగించడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆలయంలో లేదా పవిత్ర నది ఒడ్డున లేదా సరస్సు దగ్గర దీపాలను వెలిగించడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని.. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు తెస్తుందని నమ్ముతారు.
👉 పాలు, పెరుగు, పాయసం దానం: ఈ పండుగ చంద్రుడు, పాలు, పాయసం తో ముడిపడి ఉన్నందున, పాలు, పెరుగు, ఖీర్ వంటి తెల్లటి ఆహారాలను దానం చేయడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. బియ్యం పాయసాన్ని రాత్రి సమయంలో చంద్ర కాంతిలో పెట్టడం వలన చంద్రునిలోని అమృత లక్షణాలను ఇది గ్రహిస్తుంది. మర్నాడు ఈ పాయసాన్ని ప్రసాదంగా తీసుకోవడం.. పేదలు ఖీర్ లేదా పాలు దానం చేయడం వల్ల ఇంటికి శ్రేయస్సు , మంచి ఆరోగ్యం లభిస్తుంది.
👉 వస్త్ర దానం: శరత్ పూర్ణిమ రోజున పేదవారికి తెల్లని బట్టలు లేదా ఇతర వస్త్రాలను దానం చేయడం వల్ల జీవిత కష్టాలు తొలగిపోతాయి. బట్టలు దానం చేయడం గొప్ప దానాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. యువతి లేదా వివాహిత స్త్రీకి బట్టలు దానం చేయడం లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
👉 వెండి దానం: జ్యోతిషశాస్త్రంలో వెండికి చంద్రునితో సంబంధం ఉంది. వీలైతే శరత్ పూర్ణిమ నాడు బ్రాహ్మణుడికి వెండి పాత్ర (గాజు లేదా గిన్నె వంటివి) దానం చేయండి . వెండి దానం చేయడం సాధ్యం కాకపోతే, మీరు చంద్రునికి సంబంధించిన ఏదైనా ఇతర తెల్లని లోహాన్ని దానం చేయవచ్చు. ఇది జాతకంలో చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. సంపద ,శ్రేయస్సును పెంచుతుంది
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!