SGSTV NEWS online
Astrology

Weekly Horoscope: వీరికి ఉద్యోగం, పెళ్లి విషయాల్లో శుభవార్తలు.. మీ రాశికి ఎలా ఉందంటే?



వార ఫలాలు (అక్టోబర్ 11-17, 2026): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?


మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆదాయ, ఆరోగ్య ఇబ్బందులు ఉండకపోవచ్చు. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగ స్వామి సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదాన్ని పెద్దల తోడ్పాటుతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.


వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యో గులకు సొంత ఊర్లోనే కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి, ప్రేమ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, దైవ కార్యాల్లోనూ పాల్గొంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా బయటా ఒత్తిడి ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలనన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.


మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. మన సులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం అందుతుంది. ఆస్తి సమస్య ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. గ్రహ బలం కారణంగా ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయ త్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్న ప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పని భారం బాగా పెరుగుతుంది. పదోన్నతుల విషయంలో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసు కుం టాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశాభంగం తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. మిత్రుల వల్ల నష్టపోతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.


కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండా ల్సిన అవసరం ఉంది.  చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఇంటా బయటా అనుకూల తలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ, వాహన కొనుగోలు వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలకు చదువుల్లో కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.


తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు, పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపో తుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో అనుకూల తలు పెరుగుతాయి. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చు తుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసు కుంటారు. జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అవసరాలు చాలావరకు తీరిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో భద్రత, స్థిరత్వంతో పాటు, అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థికపరమైన అనుకూలతలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. అనుకోకుండా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. బంధువుల రాకపోకలతో కుటుంబంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కొందరు బంధుమిత్రులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. వ్యాపా రాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండే అవకాశం ఉంది. నష్టాల నుంచి చాలావరకు బయట పడతారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. నిరు ద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. బంధుమిత్రులకు వీలైనంతగా అండగా నిలబడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది.


కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కొద్దిగా పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలు లాభ సాటిగా ఉంటాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇంటా బయటా సానుకూల తలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. తలపెట్టిన వ్యవహారా లన్నీ కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. బంధుమి త్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్య మైన ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ సలహాలు, సూచన లతో లబ్ధిపొందుతారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి వ్యవహారంలోనూ శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలుండే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గట్టి పట్టుదలతో వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశముంది.

Related posts