వార ఫలాలు (ఫిబ్రవరి 16-22, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశముంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి వస్తుంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడవద్దు. మిథున రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): అనేక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. శుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన, వ్యవహారాలు, పనులను సమర్థవంతంగా, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి వస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండడం మంచిది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడవద్దు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త అవకాశాలు అంది వస్తాయి. కొన్ని ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగు లకు కలిసి వచ్చే సమయం ఉంది. సరైన ప్రయత్నాలు చేయడంతో పాటు, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబపరమైన ఒత్తిడి నుంచి బయటపడ తారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా బాధ్యతలన్నిటినీ పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. మితిమీరిన ఔదార్యాలను కొద్దిగా తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిపాటి ఇబ్బందులుండే అవకాశముంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా కొంత పురోగతి సాధిస్తాయి. ఆదాయం కొద్దిగా వృద్ది చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కొన్ని ప్రయత్నాలు, పనులు, వ్యవహారాలు బాగా నిదానంగా ముందుకు సాగుతాయి. బంధువులు ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి తెచ్చే సూచనలు న్నాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కొందరు మిత్రులు కూడా లేనిపోని తగాదాలకు దిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒకటి రెండు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభం పొందుతారు. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో స్నేహ సంబంధాలు మరింత పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వస్త్రాభరణాల కొనుగోలుకు అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు మీ మీద నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవ కాశం ఉంది. వ్యాపారాలలో ఆశించిన ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు దిగ్విజ యంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితికి అనుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్న నాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల సహాయంతో ఆస్తి సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను సవ్యంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కానీ, సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితముంటుంది. కష్టార్జితాన్ని ఇతరుల మీద వృథా చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల లాభముంటుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విష యంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయాలి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా కలసి వస్తాయి. చేపట్టిన పనుల్లో కొద్దిగా ఆటం కాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడడం మంచిది కాదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాబల్యం బాగా పెరుగుతాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. లాభాల బాట పడతాయి. పితృ వర్గం నుంచి కొద్దిగా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగు తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవ కాశం కలుగుతుంది. అనవసర సహాయాలు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. బంధువులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగు లకు కలిసి వచ్చే కాలం ఇది. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా ఒక సంపన్న కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు, లక్ష్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఇతరుల పనుల మీద ఉన్న శ్రద్ధ సొంత పనుల మీద పెట్టడం అవసరం. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ నుంచి సహాయాలు పొందినవారు ముఖం చాటేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలు గడిస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆధ్యాత్మిక విషయాల మీదే కాకుండా ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద కూడా అత్యధికంగా శ్రద్ధ చూపుతారు. ప్రతి విషయంలోనూ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల ద్వారా కూడా ధన లాభం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అంది వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు
- నేటి జాతకములు..19 ఏప్రిల్, 2025
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!