వార ఫలాలు (సెప్టెంబర్ 14-20, 2025): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే సూచనలున్నాయి. సహోద్యోగుల బాద్యతలు పంచుకోవాల్సి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పోతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీకు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురువు ఉన్నంత వరకూ ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా పనిభారం పెరుగుతుంది. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే సూచనలున్నాయి. సహోద్యోగుల బాద్యతలు పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా వృద్ది చెందుతాయి. వ్యాపారాల్లో లావాదేవీలు పెరిగి రాబడి అంచనాలను మించుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మంచివి. అను కోకుండా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వీలైనంతగా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగు తాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ప్రస్తుతానికి రాశ్యధిపతి చంద్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొత్త నిర్ణయాలకు, కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవనసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సామాజిక సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుంది. ఆస్తి సమస్యల పరిష్కార మయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాలకు హాజరవుతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో సహోద్యోగులతో కలిసి ముఖ్యమైన బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయ వద్దు. కొద్దిగా మోసపోయే, నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తి వివాదాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఎవరితోనూ వివాదాలకు వెళ్లకపోవడం ఉత్తమం. కుటుంబ సభ్యుల సహాయ సహకారాల ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు చక్కబడతాయి. ఆర్థిక పరి స్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొందరు మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడ తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. పోటీదార్ల బెడద చాలా వరకు తగ్గుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాలకు, ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సానుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులకు నమ్మకం ఎక్కువై, బరువు బాధ్యతలను పెంచే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం విష యంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు సమీప బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల మీద ఖర్చుల్ని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. కోపతాపాలను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. నిరుద్యోగులకు కొద్దిగా ఆశాభంగం తప్పకపోవచ్చు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం బాగా పెరుగుతుంది. పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ జీవి తంలో సామరస్యం పెరుగుతుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. కొద్దిగా నిదానంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థు లకు బాగుంటుంది. కొందరు బంధువుల తగాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలను మరింతగా పెంచడం అవసరం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఆశాభంగం కలిగిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక నమస్యలు పరిష్కారమవుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబంతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలు, సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అంది, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాభంగాలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దూరపు బంధువుల తోడ్పాటుతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలకు లోటుండదు. భారీ లక్ష్యాలను సైతం సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. అను కోకుండా పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఊరట లభిస్తుంది. కొందరు మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు