వార ఫలాలు (జూలై 13-19, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, ఏలిన్నాటి శని కారణంగా ఖర్చులు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. మిథున రాశి వారు ఆర్థిక సమస్యలను చాలావరకు తగ్గించుకుంటారు. షేర్లు, ఆర్థిక లావాదేవీలలో మదుపు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, ఏలిన్నాటి శని కారణంగా ఖర్చులు బాగా పెరుగుతాయి. కొద్దిపాటి అనారోగ్యాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా రాబడి పెరుగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ పరంగా శుభ వార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల సహాయంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కుటుంబసమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో, ధన స్థానంలో గురువు, లాభ స్థానంలో శని ఉండడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు ఊహించని లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల వారికి కూడా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని అదుపులో ఉంచుతారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. కొద్దిగా అనారోగ్యం పీడించే అవకాశం ఉంది. నిరుద్యోగులు మరింత ఎక్కువగా ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక సమస్యలను చాలావరకు తగ్గించుకుంటారు. షేర్లు, ఆర్థిక లావాదేవీలలో మదుపు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు, సమర్థతకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభ స్థానంలో శుక్రుడు, ధన స్థానంలో కుజుడి సంచారం వల్ల అప్రయత్న ధన లాభం ఉంటుంది. ఆర్థికంగా అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులను, వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పని భారం, పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి లాభ స్థానంలో గురువుతో కలిసి ఉన్నందువల్ల ఆర్థికంగా లాభాలు కలిగే కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. బంధువులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబపరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడు లాభస్థానంలో, శుక్రుడు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ వాహనాల కొనుగోలు మీద దృష్టి సారిస్తారు. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. కొన్ని వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలను ఎంత పట్టుదలగా కొనసాగిస్తే అంత మంచిది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను, లావాదేవీలను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక సమస్యలు తొలగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో మార్పులకు లేదా స్థాన చలనానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రుల వ్యక్తిగత వ్యవహారాలలో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం బాగా సామరస్యంగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో మిత్ర క్షేత్రంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సా హం లభిస్తాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బకాయిలు, బాకీలు వసూలవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గురు, రవి, కుజుల బలం వల్ల ఈ రాశివారికి ఒకటి రెండు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందడంతో పాటు ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఒకరిద్దరు బంధు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆధ్యా త్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం హాయిగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రాశ్యధిపతి శని తృతీయం, శుక్రుడు పంచమంలో, బుధుడు సప్తమ స్థానంలో సంచారం వల్ల అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలకు చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపా రాలు కూడా నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అదికారం చేపట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమంలో గురువు సంచారం వల్ల శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువు తప్ప ఇతర గ్రహాలేవీ అనుకూలంగా లేకపోవడం వల్ల అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొన్నిముఖ్యమైన పనులు అప్రయత్నంగా నెరవేరుతాయి. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం వరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాలు సవ్యంగా సాగి పోతాయి. అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025
- Janmashtami 2025: కృష్ణాష్టమి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్ధిక సమస్యలకు చెక్ పెట్టండి..
- శ్రీ కృష్ణ జన్మాష్టమి .. కుభేరులయ్యే రాశుల వారు వీరే!
- Janmashtami: జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెన్న, చక్కెరను ఎందుకు సమర్పిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే..
- దక్షిణ భారతీయులు ఎందుకు అరటి ఆకులో భోజనం చేస్తారో తెలుసా..?
- మరికాసేపట్లోనే పెళ్లి.. ఇంతలో మొదటి భార్యతో పెళ్లికొడుకు జంప్! ఆ తర్వాత..