జ్యోతిషశాస్త్రంలో విపరీత రాజయోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ యోగం పట్టినవారికి ఉద్యోగంలో రాజయోగాలు కలగడంతో పాటు, ఏం చేసినా చెలామణీ అయిపోతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఈ రంగంలో ఉన్నప్పటికీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం 6, 8, 12 స్థానాల అధిపతులు 6, 8, 12 స్థానాల్లో ఏ స్థానంలో ఉన్నా ఈ విపరీత రాజ యోగం కలుగుతుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారికి ఈ యోగం కలిగింది.
మేషం: ఈ రాశికి అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలోనే ఉన్నందువల్ల ఈ రాశి వారికి నెల రోజుల పాటు విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఈ రాశివారు ఆర్థికంగా ఎంతటి తక్కువ స్థాయిలో ఉన్నా తప్పకుండా సంపన్నులవుతారు. పూర్తిగా స్వయం కృషితో ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు. ఉద్యోగంలో సీనియర్లతో పోటీపడి, విజయం సాధించి ఉన్నత పదవులు పొందుతారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.
వృషభం:ఈ రాశికి షష్టాధిపతి అయిన శుక్రుడు షష్ట స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ నెలాఖరు వరకు విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల వీరి జీవితం ఒక్కసారిగా మారిపోవడం, ఉచ్ఛ స్థితికి చేరుకోవడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి మార్గాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ది చెందుతుంది.
మిథునం: ఈ రాశికి షష్ఠాధిపతి అయిన కుజుడు షష్ట స్థానంలోనే ఉండడం వల్ల ఈ రాశివారికి రెండు నెలల పాటు విపరీత రాజయోగం కలిగింది. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగావిముక్తి లభిస్తుంది.
సింహం: ఈ రాశికి షష్టాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాదంతా విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి సలహాలు, సూచనలతో అధికారులే కాక, బంధు మిత్రులు కూడా లబ్ధి పొందుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
వృశ్చికం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల మరో నెల రోజుల పాటు ఈ రాశివారికి విపరీత రాజయోగం కలిగింది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు సంపన్నులు కావడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థిక స్థితి బాగా అనుకూలంగా మారడంతో వీరికి ఏ విషయంలోనూ తిరుగుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు.
ధనుస్సు: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలోనే ఉన్నందువల్ల నెలన్నర పాటు ఈ రాశివారికి విపరీత రాజయోగం పట్టింది. దీనివల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాల వల్ల పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో సీని యర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
Also Read
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి
- భార్యపై అనుమానంతో దారుణం చేసిన భర్త
- Andhra Pradesh: మందుకు బానిసైన కొడుకు.. టార్చర్ భరించలేక తండ్రి ఏం చేశాడంటే..?





