SGSTV NEWS online
Astro TipsAstrologySpiritual

Job Astrology: రవి, శుక్రుల యుతి..వీరికి కొత్త ఉద్యోగ ఆఫర్లు ఖాయం..!

 

Adhikara Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, శుక్రుల యుతి ఆదాయ వృద్ధికి, అధికార యోగానికి తప్పకుండా అవకాశమిస్తుంది. రాజయోగ గ్రహాలైన శుక్ర, రవులు ఈ నెల(అక్టోబర్) 17 నుంచి తులా రాశిలో కలవడం జరుగుతోంది. తులా రాశి శుక్రుడికి స్వస్థానం కాగా, రవికి నీచ క్షేత్రం. స్వస్థానంలో ఉన్న శుక్రుడితో కలవడం వల్ల రవికి కొద్దిగా నీచభంగం కలిగింది. ఈ రెండు గ్రహాల కలయిక నవంబర్ 17 వరకు కొనసాగుతున్నందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఆదాయం పెరగడం, అధికారం లభించడంతో పాటు విదేశీ సంపాదన యోగం కూడా పట్టే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా నూరు శాతం విజయవంతమవుతుంది.

మేషం: ధన, సప్తమాధిపతి అయిన శుక్రుడు రాజయోగకారక గ్రహమైన రవితో సప్తమంలో యుతి చెందడం వల్ల ఈ రాశివారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మంచిది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఎలాంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెంది సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఆశించిన శుభవార్తలు  వింటారు.

మిథునం: తృతీయ స్థానాధిపతి రవి పంచమ స్థానంలో శుక్రుడితో యుతి చెందడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కార మవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడడం జరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆశించిన గుర్తింపు లభిస్తుంది.


కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ధన, లాభాధిపతులైన రవి, శుక్రుల కలయిక జరుగుతున్నందువల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో ఎటువంటి లక్ష్యాన్నయినా సాధించగలుగుతారు. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విదేశాలతో ఆశించిన సంబంధాలు కలుగుతాయి.


తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో లాభాధిపతి రవి కలవడం వల్ల ఈ రాశివారి మనసులో కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కలతో పాటు, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం, భద్రత లభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.



ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి రవి యుతి చెందడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలకు, రాజకీయ ప్రాబల్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఉన్నత పదవి కోసం మరో సంస్థలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యో గాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి గట్టిగా ప్రయత్నించడం మంచిది.



మకరం: రాజయోగ గ్రహాలైన రవి, శుక్రులు దశమ స్థానంలో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి అధికార యోగం పట్టే అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయం అవుతుంది.

Related posts