SGSTV NEWS
Astro TipsAstrology

Money Astrology: ఈ రాశులకు ధన లక్ష్మీ యోగం.. ఆకస్మిక ధన లాభాలకు ఛాన్స్..!



ఈ నెల(ఆగస్టు) 9న చంద్రుడితో రవి సమసప్తక దృష్టి వల్ల శ్రావణ పౌర్ణమి ఏర్పడుతుండగా, అంతకు ముందు రోజున చంద్రుడి మీద గురు దృష్టి వల్ల ధన లక్ష్మీ యోగం ఏర్పడుతోంది. ఈ రెండు మూడు రోజుల్లో ఏ శుభ కార్యం తలపెట్టినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. గణపతి లేదా లక్ష్మీదేవిని ప్రార్థించి ప్రయత్నాలు, కార్యక్రమాలు ప్రారంభించడం వల్ల విజయాలు, సాఫల్యాలు కలుగుతాయి. ఈ చంద్ర సంబంధమైన యోగాల వల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, ధనూ రాశుల వారికి అప్రయత్న ధన లాభాలు, ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది.


మేషం: ఈ రాశికి శ్రావణ పూర్ణిమ, గజకేసరి యోగాల వల్ల ఆస్తి లాభం కలగడం, ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం కావడం, అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందడం, ప్రతి ఆదాయ ప్రయత్నమూ కలిసి రావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.



వృషభం: ఈ రాశికి 7, 8, 9 తేదీల్లో ఆకస్మిక ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు అందుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధించి అత్యధికంగా లాభాలు పొందుతారు. ఆదాయానికి, ఉద్యోగానికి, పెళ్లికి సంబంధించి కొత్త ప్రయత్నాలు చేపట్టే పక్షంలో అవి తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కార సూచనలున్నాయి.



మిథునం: ఈ రాశికి శ్రావణ పూర్ణిమతో పాటు గజకేసరి యోగం వల్ల కూడా అనేక విధాలైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదా యం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఆస్తి లాభం కలుగుతుంది. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరే అవకాశం ఉంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది.



కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడిని రవి, గురువులు చూడడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమ స్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి.



తుల: ఈ రాశికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టి, జీవితం మారిపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి, కెరీర్ పరిస్థితి ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యో గాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన ఆఫర్లు అందుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

ధనుస్సు: ఈ రాశికి పూర్తి స్థాయిలో పౌర్ణమి యోగం, గజకేసరి యోగం పట్టే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ట్రేడింగ్ వంటివి విపరీతంగా లాభించడంతో పాటు, రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

Also read

Related posts

Share this