SGSTV NEWS online
Astro TipsSpiritual

కార్తీక అమావాస్య వచ్చేస్తుంది.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!




ప్రతి పక్షం రోజులకు ఒక అమావాస్య, ఒక పౌర్ణమి వస్తుంది. అయితే చాలా వరకు అమావాస్య అనేది చెడు ఫలితాలను ఇస్తుంది. కొన్ని సార్లు సానుకూల ఫలితాలనిస్తే, మరి కొన్ని సార్లు చెడు ఫలితాలను ఇస్తుంది. ఇక అతి త్వరలో కార్తీక అమావాస్య రానుంది. ఇది చాలా ప్రత్యేకమైనదని చెబుతున్నారు నిపుణులు. ఈ అమావాస్య కొన్ని రాశులపై చెడు ప్రభావాన్ని చూపుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కార్తీక అమావాస్య నవంబర్ 20న రానుంది. అయితే ఈ అమావాస్య రోజున చంద్రుడు చాలా బలహీనంగా ఉండటం వలన కొన్ని రాశులపై ఇది ప్రతి కూల ప్రభావం చూపుతుంది. అయితే ఇది ఏ రాశుల వారికి సమస్యలను తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.



కర్కాటక రాశి : కర్కాటక రాశి వారిని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. సమయానికి డబ్బు చేతికి అందక చాలా ఇబ్బంది పడుతారు.  కుటుంబంలో బేధాభిప్రయాలు ఎక్కువ అవుతాయి. మనశ్శాంతి దెబ్బతింటుంది.


కన్యా రాశి: కన్యా రాశి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో ఇతరులు మిమ్మల్ని ఎక్కువగా విమర్శిస్తారు. ఏ పని చేసినా అది మీకే వ్యతిరేకం అవుతుంది. అంతే కాకుండా చేసిన పనులు సగంలోనే ఆగిపోతాయి. ఆర్థిక నష్టాలు చికాకును తీసుకొస్తాయి. పెట్టుబడుల్లో భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. దూర ప్రయాణాలు మంచిది కాదు.



మకర రాశి : మకర రాశి వారికి ఈ కార్తీక అమావాస్య అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది. పనిభారం పెరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఇంటిలో కుటుంబ కలహాలు చికాకు పెడుతాయి. అప్పుల బాధలతో సతమతం అవ్వాల్సి వస్తుంది. వైవాహిక బంధంలో ఇబ్బందులు తలెత్తుతాయి.



మిథున రాశి : కార్తీక అమావాస్య సమయంలో ఈ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీరి మాటలే వీరికి సమస్యలను తీసుకొస్తాయి. అందువలన మిథున రాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటంబంలో మనశ్శాంతి లోపిస్తుంది.

Also Read

Related posts