SGSTV NEWS
Astrology

October 2025 Horoscope: గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశుల వారికి ఆర్థికంగా దశ తిరిగినట్టే..!



మాస ఫలాలు (అక్టోబర్ 1-31, 2025): మేష రాశి వారికి అక్టోబర్ నెలంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగులకు బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి అక్టోబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..



మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడితో పాటు శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగులకు బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. కొద్దిపాటి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంటి వ్యవహారం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభ వార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రయాణాల్లోనూ, ఆరోగ్యం విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడితో పాటు శని, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా సానుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. కొన్ని అనవసర ఖర్చులకు కళ్లెం వేయగలుగుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల మద్దతు ఉంటుంది కానీ సహచరుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా నష్టపోయే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడితో పాటు, గురు, శుక్రులు బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): బుధ, రవి, శుక్రుల అనుకూలత వల్ల నెల ప్రథమార్థం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. అనేక వైపుల నంచి ఆదాయం బాగా పెరుగుతుంది. ద్వితీయార్థంలో ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, పనిభారం తగ్గి సామరస్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. కొందరు మిత్రులతో అకారణ వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. నిరు ద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయకపోవడం శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ నెల ప్రథమార్థం సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది కానీ, ద్వితీయార్థంలో రాశ్యధి పతి రవి నీచబడడం వల్ల ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. మొదటి పదిహేను రోజుల్లో ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాలవారికి డిమాండ్ పెరుగుతుంది. ద్వితీయార్థంలో అధికారులతో అపార్థాలు తలెత్తుతాయి. తండ్రి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ నెలంతా రాశ్యధిపతి బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం కూడా రాజయోగాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. సమస్యలు, చికాకులు తగ్గిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది. కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుతో ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు పరవాలేదనిపిస్తుంది. వృథా ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. తండ్రి వైపు బంధువుల నుంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు నీచబడుతున్నందువల్ల ద్వితీయార్థంలో కొద్దిగా కుటుంబ, దాంపత్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రథమార్థం సజావుగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక, సమస్యలు ఉండకపోవచ్చు కానీ, ఆరోగ్య సమస్యలకు మాత్రం అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుని లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలను మెరుగుపరచుకోవడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి కార్యకలాపాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. బంధువులతో ఆర్థిక లావాదేవీలు పెట్టు కోకపోవడం మంచిది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, విలాసాల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. దూర ప్రాంతంలో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఈ నెలంతా ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించవచ్చు. వృత్తి, ఉద్యో గాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాదను కున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆస్తి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వా‌షాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి ఇది వరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. సొంత నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ధనపరంగా కొద్దిగా నష్ట పోయే సూచనలున్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే పెండింగు పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఊపందుకుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శనితో పాటు, బుధ, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా సంతృప్తి కరంగా సాగిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యకలాపాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలకు సంబంధించి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబపరంగా ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల నుంచి రావలసిన డబ్బును కొద్ది శ్రమతో రాబట్టుకుంటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): నెల ప్రథమార్థంలో ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ద్వితీయా ర్థంలో అధికారులు అతిగా ఆధారపడడం వల్ల పనిభారం పెరిగి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆస్తి సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. స్తోమతకు మించి ఒకరిద్దరు బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. అనారోగ్యం సమస్యలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. కుటుంబంలో చిన్నా చితకా సమస్యలుండవచ్చు. స్వల్ప అనారోగ్యం కూడా ఉండే అవకాశముంది. ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ కొద్దిపాటి తిప్పట, శ్రమతో పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొం టారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

Also read

Related posts