Telugu Astrology: బుధ, చంద్రుల మధ్య మరోసారి పరివర్తన జరగబోతోంది. జీవితాల మీద పరివర్తన యోగ ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. కొన్ని రాశులకు ఈ పరివర్తన యోగాల వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి. తండ్రీ కొడుకులైన చంద్ర, బుధుల మధ్య పరివర్తన జరగడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ నెల (జులై) 29, 30, 31 తేదీల్లో చంద్ర, బుధుల మధ్య పరివర్తన జరుగుతోంది. బుధుడు అధిపతి అయిన కన్యారాశిలో చంద్రుడు, చంద్రుడు అధిపతి అయిన కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. దీని వల్ల వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి అదృష్టాలు కలగబోతున్నాయి.
వృషభం: బుధ, చంద్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. సరికొత్త ఆదాయ వృద్ధి అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక సమస్యలను దాదాపు పూర్తిగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. రావలసిన డబ్బును, బాకీలు, బకాయిలను వసూలు చేసుకునే కార్యక్రమం చేపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల వంటి వాటి మీద పెట్టుబడులు పెడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాల వృద్ధి మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది.
మిథునం: ఈ రాశికి ధన, చతుర్థాధిపతుల మధ్య పరివర్తన జరగడంవల్ల సొంత ఇంటి కల నెరవేరడం, ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం కావడం, తల్లి వైపు నుంచి ఆస్తి లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం తదితర శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా హోదా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
కన్య: ఈ రాశితో లాభాధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల అనేక మార్గాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. అన్ని విధాలా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వంటి పెట్టుబడుల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి.
వృశ్చికం: ఈ రాశికి భాగ్య, లాభాధిపతుల మధ్య రాశి పరివర్తన జరగడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడానికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. విదేశీ సంపాదనను అనుభవించడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఎక్కువగా ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది.
మకరం: ఈ రాశికి సప్తమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం విజయవంతం అవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. విదేశాల్లో నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది.
మీనం: ఈ రాశికి పంచమ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం అత్యంత శుభప్రదం. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. పెళ్లి, ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025
- Janmashtami 2025: కృష్ణాష్టమి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్ధిక సమస్యలకు చెక్ పెట్టండి..
- శ్రీ కృష్ణ జన్మాష్టమి .. కుభేరులయ్యే రాశుల వారు వీరే!
- Janmashtami: జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెన్న, చక్కెరను ఎందుకు సమర్పిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే..
- దక్షిణ భారతీయులు ఎందుకు అరటి ఆకులో భోజనం చేస్తారో తెలుసా..?
- మరికాసేపట్లోనే పెళ్లి.. ఇంతలో మొదటి భార్యతో పెళ్లికొడుకు జంప్! ఆ తర్వాత..