గురు శిష్యులైన గురు చంద్రుల పరివర్తన జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రసిద్ధమైనది, పవిత్రమైనది. ఈ రెండు గ్రహాల మధ్య ఏ రకమైన సంబంధం ఏర్పడినా జీవితం పూల బాట అవుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అవి కలిసినా, పరస్పరం చూసుకున్నా, ఒకదానికొకటి కేంద్రాల్లో ఉన్నా, కోణాల్లో ఉన్నా పరివర్తన చెందినా, పరివర్తన చెందినా జీవితం అద్బుతంగా సాగిపోతుందనడంలో సందేహం లేదు. అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో ఈ రెండింటి మధ్యా పరివర్తన జరగబోతోంది. గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ రాశులుః మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీనం.
మేషం: ఈ రెండు గ్రహాల పరివర్తన వల్ల ఈ రాశికి కాహళ యోగమనే అద్వితీయ యోగం పడుతోంది. దీనివల్ల మనసులోని కోరికలు చాలావరకు తీరడంతో పాటు, గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ‘వద్దంటే డబ్బు’ అన్న పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదనను అనుభవించడం జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయ త్నాలు చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు.
మిథునం: ఈ రాశికి ధన, సప్తమాధిపతుల మధ్య పరివర్తన వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం వంటివి జరుగుతాయి. దాంపత్య జీవితంలో ఎటువంటి సమ స్యలున్నాతొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామికి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సంతాన ప్రాప్తి కలుగు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు ఆదాయ వృద్ధికి చేపట్టే ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి.
కన్య: ఈ రాశికి చతుర్థ లాభాధిపతుల మద్య పరివర్తన జరగడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టి అపా రంగా లబ్ధి పొందడానికి ఇది బాగా అనుకూల సమయం. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఆస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబలో సుఖ శాంతులు నెలకొంటాయి.
తుల: ఈ రాశికి తృతీయ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం విజయం సాధిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
వృశ్చికం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల కొద్ది ప్రయత్నంతో అపార ధన లాభం కలుగుతుంది. వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది. జీవిత భాగస్వామికి భాగ్య యోగాలు పడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
మీనం: ఈ రాశికి పంచమ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడంతో రాజయోగాలు, మహా భాగ్య యోగాలు కలుగుతాయి. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ప్రతి ఆదాయ ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి.
Also read
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..
- అప్పులపాలైన వ్యక్తిని.. అయ్యో పాపమని చేరదీసిన వృద్ధురాలు.. ఏం చేశాడో తెలుసా?