SGSTV NEWS
Astro TipsAstrologySpiritual

Adhi Yoga: ఈ రాశుల వారికి త్వరలో అధికారం, ఆదాయం! ఇందులో మీ రాశి ఉందా?

 

ఏ రాశికైనా 6,7,8 స్థానాల్లో గ్రహాలున్న పక్షంలో ‘అధి యోగం’ అనే అధికార యోగం పడుతుంది. ఈ 6, 7, 8 స్థానాల్లో శుభ గ్రహాలున్న పక్షంలో శుభాధియోగమని, పాప గ్రహాలున్న పక్షంలో పాపాధి యోగమని వ్యవహరిస్తారు. మొత్తం మీద ఈ స్థానాల్లో ఏ గ్రహం ఉన్నప్పటికీ, అధికార యోగం పట్టే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. పైగా శుభ గ్రహాల కారణంగా ఆదాయం వృద్ధి చెందడం కూడా జరుగుతుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభ రాశులకు ఈ ఏడాది చివరి వరకూ అధియోగం కలిగింది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల చాలా కాలం పాటు పాటు ఈ రాశివారికి దిగ్బల యోగంతో పాటు అధియోగం కూడా కొనసాగుతుంది. దీనివల్ల ప్రజాదరణ బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. 


తుల: ఈ  రాశికి షష్ట స్థానంలో శనీశ్వరుడు, అష్టమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో తప్పకుండా భారీ జీతభత్యాలతో కూడిన ఉన్నత పదవులు పొందుతారు. ఆకస్మిక ధన లాభం, ఆస్తి లాభం, జీతభత్యాల పెరుగుదల, రాబ డిలో వృద్ధి వంటి కారణాల వల్ల ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.


వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో తప్ప కుండా ఉన్నత పదవి లభిస్తుంది. ఊహించని విధంగా రాజయోగాలు, ధన యోగాలు పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.


ధనుస్సు: ఈ రాశికి షష్ట స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు, అష్టమ స్థానంలో బుధుడి సంచారం వల్ల పూర్తి స్థాయిలో శుభాధియోగం కలిగింది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు పదోన్నతి లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. సంపన్నులతో పెళ్లి కుదురుతుంది


మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో గురువు, ఏడవ స్థానంలో బుధుడి సంచారం వల్ల మంచి అధియోగం కలిగింది. దీనివల్ల పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధిక ధన లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరిగి, ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా విముక్తులవుతారు.


కుంభం: ఈ రాశికి షష్ట స్థానంలో బుధుడు, సప్తమ స్థానంలో కుజుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి, స్థితిగతులు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.

Also read

Related posts

Share this