November 21, 2024
SGSTV NEWS
Spiritual

Nagula Chavithi: ఈ ఏడాది నాగుల చవితి పండగ విషయంలో గందర గోళం.. నవంబర్ 4నా.. 5నా.. ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకోండి..



దీపావళి పండగ అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి రోజున నాగుల చవితి వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఉదయమే నిద్ర లేచి తలస్నానం ఆచరించి సమీపంలో ఉన్న నాగుల పుట్ట దగ్గరకు వెళ్లి ఆ పుట్టలో పాలు పోస్తారు. నాగ దేవత అనుగ్రహం కోసం ఉపవాసం చేస్తారు. అయితే ఈ ఏడాది నాగుల చవితి పండగ విషయంలో గందర గోళం.. నెలకొంది.


కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజులూ అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ మాసంలో శివ కేశవులను అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ నెలలో వచ్చే పండగలలో ఒకటి నాగుల చవితి. హిందువులు పాములను దేవతలుగా భావించి పుజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణం గా, శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పం నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు ఆవు నుంచి నాగ పాము వరకూ అనేక రకాల జంతుజలాలను పుజిస్తారు. అలాంటి పండగలలో ఒకటి నాగుల చవితి.


ఈ పండగను దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం శుక్ల పక్షం శుద్ధ చవితి తిధి రోజున ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు ఈ నాగుల చదివి పండగను ఘనంగా జరుపుకుంటారు.

అయితే ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో గందరగోళం నెలకొంది. పంచాగం ప్రకారం చవితి తిది రెండు రోజులు వచ్చింది. కార్తీక మాస శుక్ల పక్ష శుద్ధ చవితి తిధి నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ తిది మర్నాడు అంటే నవంబర్ 5 వ తేదీ రాత్రి 8. 56 నిమిషాల వరకు ఉంటుంది. దీంతో చవితి తిధి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకూ నవంబర్ 5వ తేదీన ఉంటుంది కనుక.. ఈ రోజున నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే నాగుల చవితి నవంబర్ 4వ తేదీ నిర్వహించుకోవాలని కొంత మంది చెబుతున్నారు

Related posts

Share via