SGSTV NEWS
Spiritual

మోహినీ ఏకాదశి పూజ నియమాలు? ఏమి చేయాలి? ఏమి చేయకూడదంటే..

 

వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం పాటించడం ద్వారా జీవితంలో సంపద, వైభవం, ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం. ఉపవాసం ప్రయోజనాలను పొందడానికి ఏకాదశి నియమాలను పాటించడం అవసరం. కనుక ఈ రోజు ఈ ఉపవాసానికి సంబంధించిన నియమాలను గురించి తెలుసుకుందాం..

ఏకాదశి ఉపవాసం ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్ష ఏకాదశి తిథిలో ఆచరిస్తారు. అంటే ఏకాదశి తిధి నెలకు రెండుసార్లు అంటే ఏడాదిలో 24 సార్లు వస్తుంది. ఈ ప్రతి ఏకాదశి తిధికి ఒకొక్క విశిష్ట ఉంది. అందులో వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువుకి సంబంధించిన మోహిని రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున ఆచారాలతో పూజ చేసే ఉపవాసాలు పాటించడం ద్వారా విష్ణువు, లక్ష్మి దేవిల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.

మోహిని ఏకాదశి తేదీ
వేద క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి మే 7న ఉదయం 10:19 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు అంటే మే 8న మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి నమ్మకం ప్రకారం మోహిని ఏకాదశి ఉపవాసం మే 8న పాటిస్తారు.


మోహిని ఏకాదశి నాడు ఏమి చేయాలి?

👉  మోహిని ఏకాదశి రోజున విష్ణువు అవతారమైన మోహినిదేవిని పూజిస్తారు. అలాగే శ్రీ హరికి గంధపు తిలకం సమర్పించండి. తులసి దళాలను సమర్పించండి.

👉  పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఎందుకంటే మోహినికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం.



👉  మోహిని ఏకాదశి ఉపవాసం పాటించేవారు సాత్వికంగా ఉండాలి. ముందు రోజు నుంచి అంటే దశమి తిథి నుంచే సాత్విక ఆహారాన్ని తినాలి.

👉   ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆవును సేవించండి. వాటికి పచ్చి గడ్డిని ఆహారంగా అందించండి.

👉  మోహిని ఏకాదశి రోజున పూజ తర్వాత, తమ శక్తి మేరకు ధాన్యాలు, బెల్లం, డబ్బు దానం చేయాలి.

మోహిని ఏకాదశి నాడు ఏమి చేయకూడదంటే


👉  మోహిని ఏకాదశి నాడు విష్ణువు పూజలో తులసి దళాలను సమర్పించాలి. అయితే సమర్పించండి. అయితే ఈ రోజున తులసి మొక్కని తాకవద్దు.

👉   తులసి ఆకులను తెంపవద్దు లేదా తులసి మొక్కకు నీరు పెట్టవద్దు.

👉  ఏకాదశి రోజున తామసిక ఆహారం తీసుకోకూడదు. అన్నం కూడా తినకూడదు…

👉అంతేకాదు ఏకాదశి రోజున నల్లని బట్టలు కూడా ధరించకూడదు.

👉   స్త్రీలను, వృద్ధులను అవమానించకూడదు.

👉  మనసులో ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు

Related posts

Share this