July 1, 2024
SGSTV NEWS
Spiritual

Mahanandi: శివరాత్రి వేళ మహానంది క్షేత్రంలో మహా అద్బతం.. నందీశ్వరునికి అభిషేకించిన పాలు రుద్ర గుండం కోనేరులోకి

శ్రీ మహానందీ శ్వర స్వామి క్రింది భాగం నుంచి నీటి ధార ప్రవహిస్తూందని చెప్పడం జరిగింది. ఆ విషయం నిర్ధారణ కావడంతో స్వామి క్రింది నుంచి వచ్చే నీరే ఆలయం లోని రుద్రగుండమని.. బ్రహ్మ, విష్ణు గుండం కోనేరులో ప్రవహిస్తాయని స్పష్టం అయింది. ఈ కోనేరులో స్నానమాచరించి సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని నానుడి. ఇప్పటి వరకు స్వామి క్రింది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయో రహస్యంగా ఉండి పోయింది.



నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో అద్బుతమైన ఘట్టం చోటు చేసుకుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శివరాత్రి పర్వదినం నాడు ఆలయంలో రాత్రి జరిగిన లింగోద్భవ కార్యక్రమంలో స్వయంభువుగా వెలసిన శ్రీ మహానందీశ్వర స్వామికి అవు పాలతో అభిషేకం నిర్వహించారు. స్వామికి అభిషేకించిన పాలు ఆలయం క్రింద ఉన్న రుద్ర గుండం కోనేరులో ప్రవహించాయి. ఈ అద్బుతమైన దృశ్యాలను చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించి పోయారు.

పురాణాల్లో చెప్పినట్లుగా శ్రీ మహానందీ శ్వర స్వామి క్రింది భాగం నుంచి నీటి ధార ప్రవహిస్తూందని చెప్పడం జరిగింది. ఆ విషయం నిర్ధారణ కావడంతో స్వామి క్రింది నుంచి వచ్చే నీరే ఆలయం లోని రుద్రగుండమని.. బ్రహ్మ, విష్ణు గుండం కోనేరులో ప్రవహిస్తాయని స్పష్టం అయింది. ఈ కోనేరులో స్నానమాచరించి సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని నానుడి. ఇప్పటి వరకు స్వామి క్రింది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయో రహస్యంగా ఉండి పోయింది. అంతే కాకుండా ఆలయంలో ఉన్న మూడు కోనేరులలో ఎప్పటికీ ఒకే స్థాయిలో నీళ్ళు ప్రవహించడం విశేషంగా చెప్పవచ్చును.

శివరాత్రి బ్రహ్మోత్సవాలు సమయంలో రుద్రగుండం కోనేరులో స్వామి వారిని అభిషేకించిన పాలను దర్శించుకున్న భక్తులు అద్బతం అంటు అనందంతో శివనామం స్మరిస్తూ పరవశించి పోయారు

Also read

Related posts

Share via