April 19, 2025
SGSTV NEWS
Spiritual

గీత జన్మించిన ప్రాంతం బ్రహ్మసరోవరం.. సూర్యగ్రహణంలో స్నానం చేయడానికి పోటెత్తే భక్తులు.. కురుక్షేత్ర విశిష్టత ..

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ కురుక్షేత్ర సరస్సులో స్నానం చేసేందుకు దేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సూర్యగ్రహణం సమయంలో సరస్సులోని పవిత్ర జలంలో స్నానం చేయడం వేల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యంతో సమానమని నమ్ముతారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సభలోని అబుల్-ఫజల్ అనే అధికారి సూర్యగ్రహణం సమయంలో ఈ సరస్సులోని నీటిని చూసిన తర్వాత ఈ సరస్సుని చిన్న సముద్రంలా అభివర్ణించాడని ఇక్కడ స్థానిక ప్రజలలో ఒక ప్రసిద్ధ కథనం ఉంది

మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశం హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా. ద్వాపర యుగంలో  మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం కనుకనే ఇది చారిత్రక నగరం, పుణ్యక్షేత్రం కూడా. ఈ కురుక్షేత్రాన్ని బ్రహ్మదేవుని బలిపీఠం అంటారు. సమయం, సంఘటనల ప్రకారం, ఈ ప్రాంతం పేరు మారుతూ వచ్చింది.  చివరకు ఈ జిల్లాకు కురుక్షేత్ర అని పేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్రంలో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలలో బ్రహ్మసరోవరం కూడా ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రదేశానికి భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు చేరుకుంటారు. ఈ రోజు స్థల విశేషాల గురించి తెలుసుకుందాం..

బ్రహ్మ సరోవరాన్ని ఎలా నిర్మించారంటే
బ్రహ్మ సరోవరం పేరులోనే విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ భగవానుడితో సంబంధం కలిగి ఉంది. కొన్ని లక్షల మందిని ప్రాణాలను తీసుకున్న ఈ కురుక్షేత్రాన్ని బ్రహ్మదేవుని బలిపీఠం అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్రాంతం పేరు కురు వంశానికి సంబంధించినది. కురుక్షేత్రంలో ఉన్న బ్రహ్మసరోవరం కౌరవులు, పాండవుల పూర్వీకుడైన కురు రాజుచే నిర్మించబడింది. అందుకే దీని పేరు ‘కురు క్షేత్రం’ అయింది.

సూర్యగ్రహణ సమయంలో స్నానం
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ కురుక్షేత్ర సరస్సులో స్నానం చేసేందుకు దేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సూర్యగ్రహణం సమయంలో సరస్సులోని పవిత్ర జలంలో స్నానం చేయడం వేల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యంతో సమానమని నమ్ముతారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సభలోని అబుల్-ఫజల్ అనే అధికారి సూర్యగ్రహణం సమయంలో ఈ సరస్సులోని నీటిని చూసిన తర్వాత ఈ సరస్సుని చిన్న సముద్రంలా అభివర్ణించాడని ఇక్కడ స్థానిక ప్రజలలో ఒక ప్రసిద్ధ కథనం ఉంది.

శివలింగాన్ని ప్రతిష్టించిన బ్రహ్మదేవుడు
జానపద కథల ప్రకారం పాండవుల ప్రథముడు ధర్మ రాజు మహాభారత యుద్ధ సమయంలో తమ విజయానికి చిహ్నంగా సరస్సు మధ్యలో ఉన్న ద్వీపంలో ఒక స్తంభాన్ని నిర్మించాడు. ఈ ద్వీప సముదాయంలో ఒక పురాతన బావి ఉంది. దీనిని ద్రౌపది బావి అని పిలుస్తారు. సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న శివుని ఆలయాన్ని సర్వేశ్వర మహాదేవ ఆలయం అని అంటారు. ఈ శివలింగాన్ని బ్రహ్మ దేవుడు స్వయంగా ప్రతిష్టించాడని విశ్వాసం.

గీతా జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
గీతా జయంతి ఉత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ ప్రారంభంలో కురుక్షేత్రంలోని బ్రహ్మసరోవరం ఒడ్డున జరుపుకుంటారు. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో ఈ సరస్సులో ప్రదక్షిణలు చేసి స్నానాలు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా సరస్సులో దీపాలను నీటిలో విడిచి పెడతారు. హారతిని ఇస్తారు. ఈ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వలస పక్షులు సరస్సు వద్దకు వస్తుంటాయి. గీతా జయంతి రోజున మాత్రమే కాదు, ప్రతి సూర్యగ్రహణం సమయంలో కూడా ఇక్కడ భారీ జాతర నిర్వహిస్తారు.

Related posts

Share via