SGSTV NEWS
Spiritual

Ekadashi: ఆ ఆలయంలో ఏకాదశి రోజున కూడా అన్నం ప్రసాదంగా ఇస్తారు..? ఈ సంప్రదాయం వెనుక పురాణ కథ ఏమిటంటే..




హిందూ మతంలో ఏకాదశి తిధికి విశిష్టస్థానం ఉంది. ఈ తిధి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది అని నమ్ముతారు. అందుకనే ఏకాదశి తిధి రోజున ఉపవాసం ఉంటారు. పండ్లు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటారు. అయితే అన్నం తినడం నిషేధం. అయితే ఒక ఆలయంలో ఏకాదశి నాడు అన్నం తినడం ఒక సంప్రదాయం. ఈ రోజు ఆ ఆలయం ఏది? అక్కడ మాత్రమే ఏకాదశి నాడు బియ్యం తినడం ఎందుకు తింటారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న నమ్మకం ఏమిటి తెలుసుకుందాం.

హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు. మత విశ్వాసం ప్రకారం ఏకాదశి రోజున అన్నం తినడం నిషిద్ధం. అయితే ఏకాదశి రోజున బియ్యం తినే ఆలయం ఉందని మీకు తెలుసా. ఈ ఆలయం ఛార్ ధామ్ యాత్రలో ఒక పుణ్యక్షేత్రం అయిన పూరీ జగన్నాథ ఆలయం. ఈ ఆలయంలో ఏకాదశి రోజున కూడా అన్నం తినే సంప్రదాయం ఉంది. జగన్నాథ పురిలో ఏకాదశి తిథి ప్రభావం ఉండదని చెబుతారు. అయితే జగన్నాథ పురిలో ఏకాదశి రోజున బియ్యం ఎందుకు తింటారో తెలుసుకుందాం.

జగన్నాథపురిలో ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి ? దేశంలో ఏకాదశి నాడు అన్నాన్ని తినే ఏకైక ఆలయం జగన్నాథ్ పూరి. ఈ ఆలయంలో ఏకాదశి రోజున అన్నాన్ని మహాప్రసాదంగా ఇస్తారు. జగన్నాథ్ పూరిలో ఏకాదశిని “అల్టి ఏకాదశి”గా జరుపుకుంటారు. అంటే ఈ రోజున అన్నంతో పాటు ఇతర ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తింటారు. అయితే సాధారణంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు, అన్నం తినరు.

జగన్నాథపురిలో ఏకాదశి నాడు అన్నం ఎందుకు తింటారంటే పూరి ధామ్‌లో ఏకాదశి రోజున అన్నం తినే ఈ సంప్రదాయం జగన్నాథుని మహా ప్రసాదంతో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ దేవుడు జగన్నాథుని మహా ప్రసాదాన్ని స్వీకరించడానికి పూరీకి చేరుకున్నాడు. అయితే అప్పటికి ప్రసాదం అయిపోయింది. ఒక కుక్క తింటున్న ప్రసాదంలో కొన్ని అన్నం మెతుకులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బ్రహ్మ దేవుడు మిగిలిన అన్నాన్ని ఆ కుక్కతో కలిసి భక్తితో తిన్నాడు.


ఈ సంఘటన ఏకాదశి రోజున జరిగిందని చెబుతారు. దీనిని చూసిన జగన్నాథుడు సంతోషించి.. తన మహా ప్రసాదానికి ఏకాదశి నియమం వర్తించదని.. ఏకాదశి రోజున అన్నం తినమని జగన్నాథుడు స్వయంగా భక్తులను ఆదేశించాడు. కనుక ఈ క్షేత్రంలో అప్పటి నునిచి ఏకాదశి నాడు అన్నాన్ని ప్రసాదంగా అందిస్తారు. భక్తులు అన్నాన్ని మహా ప్రసాదంగా తింటారు. ఈ ప్రత్యేకమైన సంప్రదాయం జగన్నాథ ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.

బద్రీనాథ్ ధామ్‌లో ఏకాదశి నాడు అన్నం కూడా తింటారు. దీనితో పాటు బద్రీనాథ్ ధామ్‌లో కూడా ఏకాదశి రోజున అన్నం తినే సంప్రదాయం ఉంది. బద్రీనాథ్ ధామ్‌ను శ్రీ మహా విష్ణువు నివాసంగా భావిస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు ఒక పూజారికి కలలో కనిపించి , ఏకాదశి రోజున తన ధామ్‌లో అన్నం నైవేద్యం పెట్టాలని, భక్తులకు కూడా మహా ప్రసాదంగా పెట్టాలని చెప్పాడు . అందువల్ల బద్రీనాథ్ ధామ్‌లో బియ్యంతో చేసిన కిచిడి ప్రసాదాన్ని ఏకాదశి నాడు అందించి భక్తులకు పంపిణీ చేస్తారు

Also read

Related posts

Share this