SGSTV NEWS
Astro TipsSpiritual

Sunset: సూర్యాస్తమం తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. దరిద్ర దేవతకు, కష్టాలకు ఆహ్వానం పలికినట్లే..

 

హిందూ గ్రంథాలలో మానవ జీవన విధానం గురించి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. వీటిని జీవితంలో స్వీకరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. కొన్ని పనులు శుభప్రదంగా భావిస్తారు. అదేవిధంగా, జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని పనులు సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు. సూర్యుడు అస్తమించే సమయంలో కొన్ని రకాల పనులు చేయడం వలన దరిద్రం దేవతకు ఆహ్వానం పలికినట్లే.. పెద్ద నష్టాలు సంభవించవచ్చు.


హిందూ మతంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. జీవిత గమనాన్ని ఇచ్చే దైవంగా భావిస్తారు. సూర్య భగవానుడిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యం అర్పించడం ద్వారా మనిషి ఆనందం, శాంతిని పొందుతాడని నమ్ముతారు. మరోవైపు సనాతన ధర్మంలో సూర్యోదయం తర్వాత కొన్ని రకాల పనులు చేయడం నిషేధించబడింది. సాయంత్రం కొన్ని పనులు చేస్తుంటే ఆ పనులు చేయవద్దు అంటూ తరచుగా పెద్దలు ఆపేస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయడం శుభప్రదం కాదని సూర్యుడు కోపగించుకుంటాడని నమ్ముతారు. అప్పుడు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ఈ రోజు పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం..

ఇంటిని శుభ్రం చేయవద్దు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ చీపురు పట్టుకోవద్దు. ఊడ్చకూడదు. ఈ సమయంలో ఊడ్చడం నిషేధించబడింది. సూర్యాస్తమయం తర్వాత ఇంటి లోపల, ఇంటి ఆవరణలో ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో ఊడ్చడం, ఇంటి నుంచి చెత్తని బయట పడేయడం చాలా అశుభకరం.


హిందూ మతంలో తులసి మొక్కకి ఆధ్యాత్మికంగా విశేషమైన స్థానం ఉంది. తులసి మొక్కని చాలా పవిత్రమైనది మొక్కగా భావిస్తారు. సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకకూడదు లేదా తులసి దళాలను కోయకూడదు అని నమ్ముతారు. ఇలా చేయడం అశుభమని భావిస్తారు. లక్ష్మీదేవికి కోపం వస్తుందని అప్పుడు ఆ వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాడని విశ్వాసం.

సూర్యాస్తమయంలో నిద్రపోకండి.

సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదని పెద్దలు చాలాసార్లు చెబుతూ ఉంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం సాయంత్రం నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తి వ్యాధుల బారిన పడతాడు. అతని ఆయుష్షు కూడా తగ్గుతుంది. ఇంటి ప్రధాన తలుపు మూసి వేయవద్దు సనాతన ధర్మంలో సూర్యాస్తమయ సమయంలో లక్ష్మీ దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులు మూసివేయకూడదు. అదే సమయంలో ఇంటి వెనుక తలుపులు ముసి వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుదని నమ్మకం.

పదునైన వస్తువులు ఉపయోగించవద్దు

సూర్యాస్తమయం సమయంలో గోర్లు కట్ చేయడం. జుట్టు కట్ చేయడం దుస్తులు సూదితో కుట్టడం వంటి పనులు చేయడం కూడా నిషేధం. ఇలా చేయడం వలన మీపై ప్రతికూల శక్తిని ప్రభావితం చేస్తుందని విశ్వాసం

Related posts

Share this