April 17, 2025
SGSTV NEWS
Astro TipsSpiritual

Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..



పెళ్లి ఇద్దరు వ్యక్తులను కలిపే వేడుక మాత్రమే కాదు రెండు కుటుంబాలను కలిపే వేడుక. యువతీ యువకులు భార్యాభర్తలుగా కలిసి మెలసి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. అయితే ఈ పెళ్లి జరిగే సమయంలో జీవితంలోని అడ్డంకులు తొలగిపోవడానికి, వివాహానికి ముందు తరచుగా ఇంట్లో గ్రహ శాంతి పూజ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు అది ఎందుకు అవసరమో మీకు తెలుసా?


హిందూ మతంలో గ్రహ శాంతి పూజ అనేది జాతకంలో గ్రహాల అననుకూల స్థానం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, సానుకూల శక్తిని పెంపొందించడానికి నిర్వహించే ఒక వేద ఆచారం. జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు) మనిషి జీవితంలోని వివిధ అంశాలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు. ఈ గ్రహాలు అనుకూలమైన స్థితిలో లేనప్పుడు వ్యక్తి ఆరోగ్యం, సంపద, వృత్తి, సంబంధాలతో పాటు ఇతర రంగాలలో కూడా అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.


గ్రహ శాంతి పూజలో సంబంధిత గ్రహాల మంత్రాలను జపించడం, హవన (అగ్ని కర్మ) చేయడం, కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ పూజను పండితుడు లేదా జ్యోతిష్కుడు శుభ సమయంలో నిర్వహిస్తారు. ప్రతి గ్రహానికి వేర్వేరు మంత్రాలు, పూజా పద్ధతులు ఉన్నాయి.

వివాహానికి ముందు గ్రహ శాంతి పూజ ఎందుకు అవసరం?
హిందూ మతంలో వివాహానికి ముందు గ్రహ శాంతి పూజ చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివాహం అంటే వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, కుటుంబాల కలయిక. వివాహ జీవితంలో ప్రేమ, సామరస్యం, శాంతిని కొనసాగించడంలో జాతకంలో గ్రహాల అనుకూలత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గ్రహ శాంతి పూజ ఇద్దరు భాగస్వాముల జాతకాల్లో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది భవిష్యత్తులో వచ్చే తేడాలు, సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అడ్డంకులను తొలగించడం
వివాహంలో అనేక అడ్డంకులు ఏర్పడుతూ ఉండవచ్చు. జాతకాల్లో లోపాలు, జాతకాలు సరిపోలిక లేకపోవడం, కుజ దోషం లేదా ఇతర గ్రహాల అశుభ స్థానాలు వంటివి. గ్రహ శాంతి పూజ ఈ అడ్డంకులను తొలగించి, వివాహం సజావుగా సాగడానికి సహాయపడుతుందని భావిస్తారు.

ఆరోగ్యం- శ్రేయస్సు
గ్రహాల అననుకూల స్థానం వధూవరుల ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గ్రహ శాంతి పూజ గ్రహాలను శాంతపరచడానికి, మంచి ఆరోగ్యం, శ్రేయస్సును కోరుకునేందుకు చేస్తారు.

ప్రతికూల శక్తి
వివాహ ప్రక్రియలో అనేక రకాల ఆచారాలు, వ్యక్తులు పాల్గొంటారు. దీని కారణంగా ప్రతికూల శక్తి ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. గ్రహ శాంతి పూజ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.

కుటుంబంలో ఆనందం
కొత్తగా పెళ్లైన జంట జీవితాంతం శాంతి, ఆనందం ఉండాలని వివాహానికి ముందు గ్రహ శాంతి పూజ నిర్వహిస్తారు. ఇది దంపతులకే కాకుండా రెండు కుటుంబాలకు కూడా సానుకూలతను తెస్తుంది.

ఈ గ్రహ శాంతి సంప్రదాయం
చాలా కుటుంబాలు వివాహానికి ముందు గ్రహ శాంతి పూజ చేసే సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. దీనిని వారు తమ వంశం, పూర్వీకుల నుంచి వచ్చిన ఆశీర్వాదంగా భావిస్తారు. వధూవరుల భవిష్యత్తు సంతోషంగా, సంపన్నంగా ఉండేలా చూసుకోవడానికి.. తమ జీవితాల్లో ఎదురయ్యే అడ్డంకులను తగ్గించడానికి వివాహానికి ముందు గ్రహ శాంతి పూజ చేయడం ఒక ముఖ్యమైన చర్య. గ్రహాల ఆశీర్వాదాలు, సానుకూల శక్తులను పొందడానికి గ్రహ శాంతి ఒక మార్గం

Also read

Related posts

Share via