July 2, 2024
SGSTV NEWS
Spiritual

Gupata Navaratri: ఆషాడం వచ్చేస్తోంది.. దుర్గాదేవిని పూజించే గుప్త నవరాత్రి తేదీ, పూజ సమయం ఎప్పుడంటే..

గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు తంత్ర విద్యకు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ సంవత్సరం ఆషాఢ గుప్త నవరాత్రులు 6 జూలై 2024, శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు గుప్త నవరాత్రుల సమయంలో తీసుకోవలసిన కొన్ని ప్రత్యేక చర్యలను గురించి తెలుసుకుందాం..గుప్త నవరాత్రుల మొదటి రోజున అక్షతలను, కొన్ని గవ్వలను తీసుకుని శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి, వాటిని ఇంటిలో లేదా డబ్బును ఉంచే చోట భద్రపరచండి. దీని తరువాత, గుప్త నవరాత్రుల మొత్తం 9 రోజులు అమ్మవారిని పూజించండి.

అమ్మవారిని భక్తీ శ్రద్దలతో నవరాత్రి వేడుకలను ఏడాదికి నాలుగు సార్లు జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రుల పండుగ దుర్గాదేవి భక్తులకు చాలా ప్రత్యేకమైనది. మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో భక్తులు దుర్గా దేవిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. అలాగే గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు తంత్ర విద్యకు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ సంవత్సరం ఆషాఢ గుప్త నవరాత్రులు 6 జూలై 2024, శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు గుప్త నవరాత్రుల సమయంలో తీసుకోవలసిన కొన్ని ప్రత్యేక చర్యలను గురించి తెలుసుకుందాం..

Madhaveswari devi : దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడిన పుణ్యక్షేత్రం .. శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం.

ఆషాఢ గుప్త నవరాత్రులలో చేయాల్సిన పరిహారాలు

గుప్త నవరాత్రుల మొదటి రోజున అక్షతలను, కొన్ని గవ్వలను తీసుకుని శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి, వాటిని ఇంటిలో లేదా డబ్బును ఉంచే చోట భద్రపరచండి. దీని తరువాత, గుప్త నవరాత్రుల మొత్తం 9 రోజులు అమ్మవారిని పూజించండి. నవరాత్రులలో ఉపవాస దీక్ష చేపట్టి నవరాత్రుల్లో చివరి రోజున.. ఆ గవ్వలను ఇంటి ఆవరణలోని నేలలో పాతిపెట్టండి. ఈ రెమెడీని పాటించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు

ఆషాఢ గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గాదేవి పాదాలకు తామర పువ్వులను సమర్పించాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన వేద మంత్రాలను జపిస్తూ పూజించండి. ఇలా చేయడం వల్ల అమ్మవారు దుర్గాదేవి సంతోషిస్తుంది. వ్యక్తీ తన జీవితాంతంలో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది.

Spirituality: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది… తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!

ఆషాఢ గుప్త నవరాత్రి శుభ సమయం 2024 హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం గుప్త నవరాత్రి వేడుకలు జూలై 6, 2024 శనివారం ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో గుప్త నవరాత్రి జూలై 15, 2024 సోమవారం ముగియనున్నాయి. జూలై 6వ తేదీ ఉదయం 5.11 గంటల నుంచి 7.26 గంటల వరకు గుప్త నవరాత్రి కలశ స్థాపన చేయడం శుభప్రదం.

also read :కొన్ని వందల వేలఏళ్లుగా తుప్పు పట్టని పరశురాముడి గండ్రగొడ్డలి.. తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

Related posts

Share via