SGSTV NEWS online
Spiritual

అపర ఏకాదశి మే 12నా 13నా? సరైన తేది తెలుసుకోండి.. ఇలా చేస్తే అపార పుణ్యఫలం..



Apara Ekadashi: హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో వచ్చే ‘అపర ఏకాదశి’ను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ ఉపవాసం పాపాలను తొలగించి సుఖసమృద్ధులను కలిగిస్తుందని విశ్వాసం. ఈ ఏడాది అపర ఏకాదశి ఎప్పుడు వస్తుంది? దాని పూజా విధానం, ముహూర్తం, పాటించాల్సిన నియమాలపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది.


Apara Ekadashi 2026: హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి వ్రతాల్లో అపర ఏకాదశి ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. “అపర” అంటే అపారమైన / అంతులేని అని అర్థం. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఉంది. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు, మనసుకు ప్రశాంతత పొందేందుకు ఈ వ్రతం ఎంతో ఉపయుక్తంగా భావిస్తారు.


తిథి & ముహూర్త వివరాలు:

ఈ ఏడాది ఏకాదశి తిథి వివరాలు ఇలా ఉన్నాయి:

👉  ఏకాదశి తిథి ప్రారంభం: మే 12, 2026 – మధ్యాహ్నం 09:56 గంటలకు

👉  వ్రత ఆచరణ దినం: మే 13, 2026 (బుధవారం) (ఉదయ తిథి ఆధారంగా నిర్ణయం)

👉  వ్రత పారణ (ఉపవాస విరమణ): మే 14, ఉదయం 06:00 – 07:41 గంటల మధ్య

👉  ద్వాదశి తిథి ముగింపు: మే 14, ఉదయం 07:41 గంటలకు

అపర ఏకాదశి పూజా విధానం

1. శుచీశుభ్రత & సంకల్పం
👉 ఉదయాన్నే స్నానం చేసి శుద్ధంగా ఉండాలి

👉  అవసరమైతే నీటిలో గంగాజలం కలుపుకోవచ్చు

👉  పూజ గదిలో దీపం వెలిగించి ఉపవాస సంకల్పం తీసుకోవాలి

2. శ్రీమహావిష్ణు పూజ

👉  “ఓం లక్ష్మీ నారాయణాయ నమః” మంత్రంతో అభిషేకం చేయాలి

👉  పాలు, పంచామృతం, శుద్ధ జలం సమర్పించాలి

👉  చందనం, కుంకుమ, పసుపు, పూలు, తులసి దళాలతో అలంకరించాలి

3. నైవేద్యం

👉  పండ్లు, తీపి పదార్థాలు సమర్పించాలి

👉  హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరితో పంచుకోవాలి

👉  ఏకాదశి రోజున చేయాల్సిన ముఖ్య పనులు

👉  జాగరణ: రాత్రి నిద్ర లేకుండా విష్ణు సహస్రనామం, భజనలు, మంత్రజపం చేయాలి

👉  దానం: అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శ్రేయస్కరం

👉  భగవన్నామ స్మరణతో రోజంతా గడపడం ఉత్తమం

   ఏకాదశి రోజున చేయకూడని పనులు

👉  అన్నం తినకూడదు: బియ్యం పదార్థాలు పూర్తిగా మానాలి

👉  తులసి కోయకూడదు: పూజకు అవసరమైనవి ముందే సిద్ధం చేసుకోవాలి

👉  అశుభ్రత పనులు: జుట్టు కత్తిరించడం, గోర్లు తీయడం వంటి పనులు చేయకూడదు

👉  నెగటివ్ ప్రవర్తన: కోపం, అసూయ, దూషణలు మానుకోవాలి

ముఖ్య సూచన

అపర ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధ, భక్తి, నియమాలతో ఆచరిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి

Related posts