మరోసారి కాకినాడ జిల్లాలో అర్ధరాత్రి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం బయట ప్రత్యక్షం అయింది. అర్ధరాత్రి కావడంతో పోలీసుల సంరక్షణలో కారులోనే పడుకున్న అఘోరీ నాగ సాధువు..
కాకినాడ జిల్లా సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సోమవారం రాత్రి సామర్లకోట మండలం మాధవపట్నం చేరుకుంది అఘోరి నాగ సాధు. నాగ సాధు రాకను తెలుసుకున్న పోలీసులు ఆమె ఉన్న ప్రదేశానికి మహిళా కానిస్టేబుల్స్ తో చేరుకున్నారు. భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చానని అర్ధరాత్రి కావడంతో గుడికి ఇప్పుడు వెళ్ళనని ఉదయం వెళ్తానని పోలీసులకు చెప్పడంతో జనసంచారం లేని నిర్మానుష ప్రదేశంలో కారులోనే రాత్రంతా ఉండిపోయింది అఘోరీ. దీంతో ఆమె కు భద్రతను ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు పెద్దాపురం డి.ఎస్.పి శ్రీహరి రాజు.
అఘోరి కారులో పెట్రోల్ క్యాన్ ఉండటం పట్ల పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కారులో అగరబత్తులు వెలిగించి పెట్రోల్ క్యాన్ పక్కనే అగరబత్తులు అఘోరి ఉంచడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పెట్రోల్ క్యాన్ ఇవ్వాలని పోలీసులు కోరినా.. అఘోరి మాత ససే మీరా అంది. తన ప్రాణమైన ఇస్తాను కానీ పెట్రోల్ క్యాన్ ను ఇవ్వని ఇవ్వనని తెగేసి చెప్పింది అఘోరీ. దీంతో చేసేదేమీ లేక పెట్రోల్ క్యాన్ తీసుకునే సాహసం చేయలేదు పోలీసులు.
ఈరోజు ఉదయం సామర్లకోట భీమేశ్వర స్వామి దర్శనానికి పోలీసుల పహారాతో మధ్య ఆలయానికి చేరుకుంది అఘోరి. ఉదయం భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అఘోరీ నాగసాధు….అఘోరి రాకతో స్థానిక ప్రజలు, భక్తులు ఆమెను చూడడానికి ఆలయ పరిసర ప్రాంతాలలో, ఆలయం లోపల ఆసక్తి చూపించారు. అయితే గుళ్లోకి ప్రవేశించాలంటే వస్త్రాలు ధరించుకోవాలని పోలీసులు, ఆలయ అధికారులు సూచించారు. వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఓకే చెప్పడంతో పోలీసులు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





